తమ్మీ.. బంతి నేలకు తాకింది రా: విరాట్ కోహ్లీ (వీడియో)
ఐపీఎల్ 2026 సీజన్‌లో ఆర్‌సీబీ విజేతగా నిలిచింది. అద్వితీయమైన ప్రదర్శనతో రెండో టైటిల్ ముద్దాడింది. ఆదివారం అహ్మదాబాద్ వేదికగా ఏకపక్షంగా సాగిన ఫైనల్లో సమష్టిగా రాణించిన ఆర్‌సీబీ 5 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్‌ను చిత్తు చేసింది. విరాట్ కోహ్లీ అజేయ హాఫ్ సెంచరీతో ఆర్‌సీబీ విజయ ఢంకా మోగించాడు.
అయితే ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ మధ్య ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది. అర్షద్ ఖాన్ వేసిన ఇన్నింగ్స్ 16వ ఓవర్ చివరి బంతికి విరాట్ కోహ్లీ భారీ షాట్‌కు ప్రయత్నించగా.. శుభ్‌మన్ గిల్ డైవ్ చేసి క్యాచ్ అందుకున్నాడు.
అంపైర్ ఔట్‌గా ప్రకటించగా.. బంతి నేలను తాకిందంటూ కోహ్లీ అభ్యంతరం వ్యక్తం చేశాడు. దాంతో అంపైర్లు సమీక్ష కోరగా.. పలు కోణాల్లో రిప్లేలను పరిశీలించిన థర్డ్ అంపైర్.. బంతి నేలను తాకినట్టు నిర్దారించి కోహ్లీని నాటౌట్‌గా ప్రకటించాడు. దాంతో కోహ్లీ సంతోషంతో ఎగిరి గంతేసాడు. శుభ్‌మన్ గిల్ దగ్గరకు వెళ్లి బంతి నేలకు తాకిందని చెప్పాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. 'తమ్మీ.. బంతి నేలకు తాకింది రా'అని కోహ్లీ చెప్పాడని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 155 పరుగులే చేసింది. వాషింగ్టన్ సుందర్(37 బంతుల్లో 5 ఫోర్లతో 50 నాటౌట్) ఒక్కడే అజేయ హాఫ్ సెంచరీతో రాణించగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యరు. ఆర్‌సీబీ బౌలర్లలో రసిక్ సలామ్(3/27) మూడు వికెట్లు తీయగా.. భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్ రెండేసి వికెట్లు తీసారు. కృనాల్ పాండ్యాకు ఒక వికెట్ దక్కింది.
అనంతరం ఆర్‌సీబీ 18 ఓవర్లలో 5 వికెట్లకు 161 పరుగులు చేసి గెలుపొందింది. విరాట్ కోహ్లీ(42 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 75 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో రాణించగా.. వెకంటేశ్ అయ్యర్(16 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 32) పర్వాలేదనిపించాడు. గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో రషీద్ ఖాన్ రెండు వికెట్లు తీయగా.. మహమ్మద్ సిరాజ్, కగిసో రబాడ, అర్షద్ ఖాన్ చెరో వికెట్ పడగొట్టారు.
Heated argument between Virat Kohli & Shubman Gill 🤯🔥
— lndian Sports Netwrk (@IS_Netwrk29) May 31, 2026
Look at the reaction of Virat Kohli 😭😂 pic.twitter.com/zYoDQfyDWM
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications