Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2026: ఆర్‌సీబీకి నో ఛాన్స్.. టాప్-2లో నిలిచేది ఆ రెండు జట్లే: వసీం జాఫర్

ఐపీఎల్ 2026 సీజన్‌లో టాప్-2లో నిలిచే రెండు జట్లను టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ అంచనా వేసాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో పాటు పంజాబ్ కింగ్స్ టాప్-2లో నిలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అభిప్రాయపడ్డాడు. పంజాబ్ కింగ్స్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయానంతరం.. తన యూట్యూబ్ ఛానెల్‌ వేదికగా మాట్లాడిన వసీం జాఫర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

' పంజాబ్ కింగ్స్ కచ్చితంగా టాప్‌లోనే కొనసాగుతోంది. వారు కూడా తమ సాయశక్తులా అగ్రస్థానంలో కొనసాగేందుకు ప్రయత్నిస్తున్నారు. రాత్రిపూట లైట్ల కింద తెల్ల బంతిని పట్టుకోవడం అంత తేలిక కాదు. వారు ఎలాంటి అవకాశాన్ని వదులుకోరని నేను ఖచ్చితంగా అనుకుంటున్నా. వారికి ఇంకా టాప్-2లో నిలిచే అవకాశం ఉంది.’అని వసీం జాఫర్ చెప్పుకొచ్చాడు.

అతను లేకపోవడంతో..

ఇకరాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) కూడా కొన్ని సవాళ్లను ఎదుర్కొంటుందని వసీం జాఫర్ అభిప్రాయపడ్డాడు. ఫిల్ సాల్ట్ అందుబాటులో లేకపోవడం ఆ జట్టుకు ఆందోళన కలిగించే అంశం. 'ఆర్‌సీబీ ఎక్కువగా విరాట్ కోహ్లీపై ఆధారపడుతుంది. అతను ఔట్ అయితే జట్టు కష్టాల్లో పడటం చూశాం. వారికి కూడా ఇబ్బందులున్నాయి. విధ్వంసకర ఓపెనర్ సాల్ట్ కొన్ని మ్యాచ్‌లకు దూరమవడం ఆందోళన కలింగే అంశం.

ఆరంభంలో ఆర్‌సీబీ అద్భుతంగా ఉందనిపించింది. కానీ గత కొన్ని మ్యాచ్‌ల్లో వారు ఓడిన తీరు చూస్తుంటే వారికి కూడా చింతలున్నాయి. కాబట్టి, టాప్-2లో పంజాబ్, SRH జట్లకు మెరుగైన అవకాశాలున్నాయని నేను భావిస్తున్నా.’అని వసీం జాఫర్ పేర్కొన్నారు.

IPL 2026 Wasim Jaffer Predicts SRH and RR to Finish in Top 2 After Hyderabad s Rise to the Top

పంజాబ్‌దే టాప్..

ప్రస్తుతం సన్‌రైజర్స్ హైదరాబాద్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. పంజాబ్ కింగ్స్ రెండవ స్థానంలో కొనసాగుతోంది.

పంజాబ్ కింగ్స్ 6 విజయాలు, 13 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది. గత రెండు ఓటముల తర్వాత వారు అగ్రస్థానాన్ని కోల్పోయారు. అయినా పంజాబ్‌కు టాప్ 2లో నిలిచే అవకాశం ఉందని జాఫర్ నమ్ముతున్నాడు. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓడినా పంజాబ్ కింగ్స్ టాప్-2లో రాగలదని పేర్కొన్నాడు. 'పంజాబ్ ఇప్పటికీ టాప్ 2లోకి రాగలదు. వారికి కావలసినవన్నీ ఉన్నాయి. క్యాచ్‌ల లోపాలను వారు సరిదిద్దుకుంటారు.’ అని వసీం జాఫర్ పేర్కొన్నారు.

హ్యాట్రిక్ పరాజయాలు..

ఐపీఎల్ 2026 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ అదిరిపోయే ఆరంభాన్ని అందుకుంది. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో మ్యాచ్ రద్దు కావడానికి ముందు, తొలి రెండు మ్యాచ్‌ల్లో గెలిచింది. లీగ్ ఆరంభమైన నెల తర్వాత రాజస్థాన్ రాయల్స్‌తో ఓడిపోయే ముందు PBKS వరుసగా నాలుగు విజయాలను అందుకుంది. అయితే, ఈ సీజన్‌లో పంజాబ్ ఇప్పుడు వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది.

ఈ సీజన్‌ను ఓటమితో ప్రారంభించిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. తొలి నాలుగు మ్యాచ్‌ల్లో సన్‌రైజర్స్ ఒకే విజయాన్ని నమోదు చేసింది. ఆ తర్వాత, కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో ఓడిపోయే ముందు SRH ఐదు మ్యాచ్‌ల విజయ పరంపరను కొనసాగించింది. గత మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌ను ఓడించగా, ప్రస్తుతం SRH 7 విజయాలు, 14 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుంది.

Story first published: Thursday, May 7, 2026, 23:06 [IST]
Other articles published on May 7, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+