Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

గోయెంకా సర్.. పంత్‌ను తప్పించి అతన్ని కెప్టెన్ చేయండి: టీమిండియా మాజీ ఓపెనర్

ఐపీఎల్ 2026 సీజన్‌లో పేలవ ప్రదర్శన కనబరుస్తున్న లక్నో సూపర్ జెయింట్స్ మళ్లీ విజయాల బాట పట్టాలంటే కీలక నిర్ణయాలు తీసుకోవాలని టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్ సూచించాడు. కెప్టెన్సీ బాధ్యతల నుంచి రిషభ్ పంత్‌ను తప్పించి ఎయిడెన్ మార్క్‌రమ్‌కు అప్పగించాలని లక్నో మేనేజ్‌మెంట్‌కు సలహా ఇచ్చాడు.

ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లు ఆడిన లక్నో ఆరు మ్యాచ్‌ల్లో ఓడి పాయింట్స్ టేబుల్‌లో అట్టడుగు స్థానంలో నిలిచింది. రూ.27 కోట్ల రికార్డ్ ధర పెట్టి కొనుగోలు చేసిన రిషభ్ పంత్ అటు బ్యాటింగ్.. ఇటు కెప్టెన్‌గానూ తడబడుతున్నాడు. లక్నో పేలవ ప్రదర్శనపై అభిమానులు తీవ్ర అసహనానికి గురవుతున్నారు. తాజాగా లక్నో ప్రదర్శనపై మాట్లాడిన వసీం జాఫర్.. పంత్‌ను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించాలని సూచించాడు. బ్యాటింగ్ ఆర్డర్‌లో కూడా కొన్ని మార్పులు చేయాలన్నాడు.

పంత్‌ను తప్పించండి..

'ప్రస్తుతం లక్నో సూపర్ జెయింట్స్ అస్తవ్యస్తంగా కనిపిస్తోంది. వారి నుంచి ఏం ఆశించాలో కూడా తెలియడం లేదు. నేను ఆ జట్టు డగౌట్‌లో ఉంటే.. రిషభ్ పంత్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించి మార్క్‌రమ్‌కు అప్పగించేవాడిని. మార్‌క్రమ్, మిచెల్ మార్ష్‌లతో ఓపెనింగ్ చేయించేవాడిని. మూడో స్థానంలో నికోలస్ పూరన్, నాలుగో స్థానంలో రిషభ్ పంత్, ఐదో స్థానంలో ఆయుష్ బదోని, ఆరో స్థానంలో అబ్దుల్ సమద్, ఏడో స్థానంలో ముకుల్ చౌదరిని ఆడిస్తాను. ఇది నా టాప్ 7 బ్యాటింగ్ లిస్ట్.

IPL 2026 Wasim Jaffer Advises LSG to Make Aiden Markram Captain to Free Up Rishabh Pant

పంత్‌కు స్వేచ్చనివ్వాలి

రిషభ్ పంత్ కేవలం ఆటగాడిగా మాత్రమే ఉండాలి. అతనికి పూర్తి స్వేచ్ఛనిచ్చి మ్యాచ్‌లు గెలిపించమని కోరితే.. పంత్ నుంచి అత్యుత్తమ ప్రదర్శన వస్తుంది. కెప్టెన్సీ భారాన్ని అతనిపై మోపవద్దు. ఎయిడెన్ మార్‌క్రమ్ అద్భుతమైన కెప్టెన్. అతను సౌతాఫ్రికా జట్టును విజయవంతంగా నడిపించాడు.

మానసికంగా బలంగా ఉండటంతో పాటు ప్రశాంతంగా ఉంటాడు. ఇతర ఆటగాళ్ల నుంచి ఉత్తమ ప్రదర్శనను రాబట్టగలడు. అయితే ఇది నా సూచన మాత్రమే. నేను లక్నో జట్టులో ఉంటే ఇలానే చేసేవాడిని.’అని వసీం జాఫర్ చెప్పుకొచ్చాడు.

వసీం జాఫర్ చెప్పినట్లుగానే కెప్టెన్సీ బాధ్యతలు లేనప్పుడే రిషభ్ పంత్ అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాడు. ఐపీఎల్ 2018 సీజన్‌లో రిషభ్ పంత్ సుమారు 174 స్ట్రైక్‌రేట్‌తో 684 పరుగులు చేశాడు. ఈ సీజన్‌లో 8 మ్యాచ్‌లు ఆడిన పంత్ 27 సగటుతో 189 పరుగులే చేశాడు.

Story first published: Monday, April 27, 2026, 16:18 [IST]
Other articles published on Apr 27, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+