Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

RCB vs KKR: యువ బౌలర్‌కు క్షమాపణలు చెప్పిన విరాట్ కోహ్లీ!

ఐపీఎల్ 2026 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ దుమ్మురేపుతున్నాడు. బుధవారం రాయ్‌పూర్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్)తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ(60 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్స్‌లతో 105 నాటౌట్) అజేయ శతకంతో చెలరేగి ఆర్‌సీబీ విజయంలో కీలక పాత్ర పోషించాడు.

గత రెండు మ్యాచ్‌ల్లో డకౌట్‌గా వెనుదిరిగిన కోహ్లీ.. కేకేఆర్‌పై ఆకాశమే హద్దుగా చెలరేగాడు. అతని సెంచరీ ధాటికి ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో ఆర్‌సీబీ పాయింట్స్ టేబుల్‌లో అగ్రస్థానంలో నిలిచింది.

యువపేసర్‌కు సారీ.. ఎందుకంటే..?

అయితే ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ.. కేకేఆర్ అరంగేట్ర పేసర్ హర్ష్‌దూబేకు క్షమాపణలు చెప్పాడు. ఆర్‌సీబీ ఇన్నింగ్స్ సందర్భంగా మూడో ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ ఆఖరి బంతిని షార్ట్ ఫైన్ లెగ్ దిశగా ఆడిన కోహ్లీ.. సింగిల్ తీసే క్రమంలో హర్ష్‌దూబేను ఢీకొట్టాడు.

IPL 2026 Virat Kohli Wins Hearts After Apologizing to KKR Debutant Saurabh Dubey
Photo Credit: screen grab for JioHotstar

సింగిల్ పూర్తి చేసిన వెంటనే.. హర్ష్‌దూబేకు క్షమాపణలు చెప్పాడు. హర్ష్‌దూబే సైతం పర్వాలేదంటూ కోహ్లీని హగ్ చేసుకున్నాడు. కోహ్లీ చర్యకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం అంటే ఇదేనని కామెంట్ చేస్తున్నారు. యువ పేసర్‌కు కూడా కోహ్లీ క్షమాపణలు చెప్పాడంటే మాములు విషయం కాదని కొనియాడుతున్నారు. అప్‌కమింగ్ క్రికెటర్లు విరాట్ కోహ్లీని చూసి నేర్చుకోవాలని హితవుపలుకుతున్నారు.

సింగిల్‌కు సెలెబ్రేషన్..

అంతేకాకుండా హర్ష్‌దూబే వేసిన తొలి ఓవర్ ఆఖరి బంతికి సింగిల్ తీసిన కోహ్లీ.. డకౌట్ల పరంపరకు బ్రేక్ వేసాననే విషయాన్ని తెలియజేస్తూ సెలెబ్రేట్ చేసుకున్నాడు. మైదానంలో చాలా సరదాగా ఉంటూ తన ఆటను ఆస్వాదించిన కోహ్లీ.. 58 బంతుల్లో సెంచరీ మార్క్ అందుకోవడంతో పాటు ఆర్‌సీబీ విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 192 పరుగులు చేసింది. అంగ్‌క్రిష్ రఘువంశీ(46 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 71) హాఫ్ సెంచరీతో రాణించగా.. రింకూ సింగ్(29 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 49 నాటౌట్) దూకుడుగా ఆడాడు. ఆర్‌సీబీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, జోష్ హజెల్ వుడ్, రసిక్ సలామ్ తలో వికెట్ తీసారు.

అనంతరం ఆర్‌సీబీ 19.1 ఓవర్లలో 4 వికెట్లకు 194 పరుగులు చేసి గెలుపొందింది. కోహ్లీతో పాటు దేవదత్ పడిక్కల్(27 బంతుల్లో 7 ఫోర్లతో 39) రాణించాడు. కేకేఆర్ బౌలర్లలో కార్తీక్ త్యాగీ(3/32) మూడు వికెట్లు తీయగా.. సునీల్ నరైన్ ఒక వికెట్ పడగొట్టాడు.

Story first published: Thursday, May 14, 2026, 15:41 [IST]
Other articles published on May 14, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+