రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) స్టార్ ఓపెనర్ విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలోనే ముంబై ఇండియన్స్‌పై 1000 పరుగులు చేసిన తొలి బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా వాంఖడే వేదికగా ఆదివారం జరిగిన హైఓల్టేజ్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ(38 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 50) హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. తద్వారా ముంబై ఇండియన్స్‌పై 1000 పరుగుల మైలురాయి అందుకున్నాడు.
ముంబైపై 36 ఇన్నింగ్స్‌ల్లోనే కోహ్లీ ఈ ఘనత సాధించాడు. ఈ క్రమంలో అతను కేఎల్ రాహుల్ రికార్డును బద్దలు కొట్టాడు. కేఎల్ రాహుల్ ముంబై ఇండియన్స్‌పై 21 ఇన్నింగ్స్‌ల్లో 977 పరుగులు చేశాడు. ఈ ఇద్దరికి మరే బ్యాటర్ కూడా దరిదాపుల్లో లేరు. ఈ జాబితాలో విరాట్ కోహ్లీ(10003), కేఎల్ రాహుల్(977) తర్వాత శిఖర్ ధావన్(28 ఇన్నింగ్స్‌ల్లో 901), అజింక్యా రహానే(29 ఇన్నింగ్స్‌ల్లో 888), సురేష్ రైనా(36 ఇన్నింగ్స్‌ల్లో 850) ఉన్నారు.

ఇటీవలే టీ20 ఫార్మాట్‌లో ఒక జట్టుపై అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా కోహ్లీ రికార్డు అందుకున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్‌పై 1,188 పరుగులతో ఈ ఘనత సాధించాడు. ఈ క్రమంలో రోహిత్ శర్మ(1, 161 vs KKR) రికార్డును అధిగమించాడు.
ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా విరాట్ కోహ్లీనే కొనసాగుతున్నాడు. 263 ఇన్నింగ్స్‌ల్లో 8814 పరుగులు చేశాడు. మరే బ్యాటర్ కూడా కోహ్లీ దరిదాపుల్లో లేరు. ఈ సీజన్‌లో కోహ్లీ మరో 200 పరుగులు చేస్తే 9000 పరుగుల మైలురాయి అందుకుంటాడు. ఓవరాల్‌గా టీ20ల్లో 13500 పరుగులు చేసిన కోహ్లీ.. క్రిస్ గేల్ రికార్డుకు 1000 పరుగుల దూరంలో నిలిచాడు. ఈ సీజన్‌తో పాటు వచ్చే సీజన్‌లో కోహ్లీ సత్తా చాటితే గేల్ రికార్డ్ బద్దలు కొట్టనున్నాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 240 పరుగులు చేసింది. ఫిల్ సాల్ట్(36 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లతో 78), విరాట్ కోహ్లీ(38 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 50), టీమ్ డేవిడ్(16 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 34 నాటౌట్) చెలరేగారు. ముంబై బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, హార్దిక్ పాండ్యా, మిచెల్ సాంట్నర్, శార్దూల్ ఠాకూర్ తలో వికెట్ తీసారు.