Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

గురువులను గౌరవించండి.. కలలను నిజం చేసుకోండి: విద్యార్థులకు విరాట్ కోహ్లీ దిశానిర్దేశం

గురువులను గౌరవించాలని, కలలను నిజం చేసుకోవాలని విద్యార్థులకు టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ దిశానిర్దేశం చేశాడు. నిజాయితీ గల కలలే జీవితాన్ని మారుస్తాయని చెప్పాడు. తన చిన్ననాటి కోచ్ రాజ్‌కుమార్ శర్మ తో కలిసి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఆర్కేపురం క్రికెట్ అకాడమీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న విరాట్ కోహ్లీ.. విద్యార్థులను ఉద్దేశించి స్ఫూర్తిదాయక ప్రసంగం ఇచ్చాడు.

పాఠశాలల్లో ప్రసంగించడం అలవాటు లేదంటూనే తన స్పీచ్‌తో అదరగొట్టాడు. 'నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు. నాకు పాఠశాల్లో ప్రసంగించే అలవాటు లేదు. అందుకే కాస్త ఇబ్బందికరంగా ఉంటోంది. ఎందుకంటే క్రికెట్ కోసం చాలా ఏళ్ల క్రితమే స్కూల్ వాతావరణానికి దూరమయ్యాను. నా అనుభవాన్ని ఇప్పుడు మీతో పంచుకోవాలనుకుంటున్నా.

IPL 2026 Virat Kohli s Honest Advice to Students Be Committed to Your Dreams
Photo Credit: twitter (X)

స్కూల్ వాతావరణం ఎలా ఉంటుందో నాకు తెలుసు. ప్రస్తుతం మీరు ఏ దశలో ఉన్నారో, ఆ దశను నేను కూడా దాటి వచ్చాను. క్రికెట్ వల్ల నా జీవితంలో నా ప్రాధాన్యతలు ఎలా మారాయో నా అనుభవం ద్వారా మీకు చెప్పాలనుకుంటున్నాను. నేను చెప్పేది ఒక్కటే.. పాఠశాల అనేది మీరు నేర్చుకోవడానికి, ఎదగడానికి, మంచి వ్యక్తులుగా మారడానికి ఒక వేదిక.

ముందుగా ఈ వాతావరణానికి, మీ ఉపాధ్యాయులకు గౌరవం ఇవ్వండి. వారు తమ జీవితంలో కొంత భాగాన్ని మీకు బోధించడానికి కేటాయిస్తున్నారు. వారికి మీరు ఇవ్వాల్సిన గౌరవాన్ని.. మీరు చూపించాల్సిన దృష్టిని, శ్రద్ధను అందించడం చాలా ముఖ్యం.

నా జీవితంలో క్రికెట్‌ను కెరీర్‌గా చాలా త్వరగానే ఎంచుకున్నా. అందుకోసం నిజాయితీగా కలలు కన్నా. క్రికెట్‌లో సక్సెస్ అవుతానని ముందు నుంచే నమ్మాను. నేను ఎంచుకున్న మార్గం సరైందని భావించా. అందుకోసం అంకితభావంతో పనిచేశా. వందశాతం నిజాయితీగా ఉన్నామా? లేదా? అనేది మీకు మాత్రమే తెలుస్తుంది. నేను 8 ఏళ్ల వయసున్నప్పుడు క్రికెట్ అకాడమీలో చేరా. స్కూల్‌కు వెళ్తూనే అకాడమీలో శిక్షణ తీసుకున్నా. నా చిన్నతనం అలా గడిచింది. ఇప్పుడున్న మీరందరూ క్రికెట్ విలువ తెలుసుకొని నేర్చకొనేందుకు వస్తున్నారని భావిస్తున్నా. అకాడమీలో సదుపాయాలు బాగున్నాయి. మీ అందరికి ఆల్‌ది బెస్ట్.'అని విరాట్ తన ప్రసంగాన్ని ముగించాడు.

ఐపీఎల్ 2026 సీజన్‌లో విరాట్ కోహ్లీ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఆర్‌సీబీ కూడా వరుస విజయాలతో దూసుకెళ్తోంది. ఆర్‌సీబీ తమ తదుపరి మ్యాచ్‌ను గురువారం అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది.

Story first published: Tuesday, April 28, 2026, 17:01 [IST]
Other articles published on Apr 28, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+