Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2026: కోహ్లీ విధ్వంసం.. లక్నోపై ఆర్‌సీబీ ఘన విజయం!

ఐపీఎల్ 2026 సీజన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) జైత్రయాత్ర కొనసాగుతోంది. లక్నో సూపర్ జెయింట్స్‌తో బుధవారం చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన ఆర్‌సీబీ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. బౌలింగ్‌లో రసిక్ సలామ్, భువనేశ్వర్ కుమార్ నిప్పులు చెరిగితే.. బ్యాటింగ్‌లో విరాట్ కోహ్లీ సత్తా చాటాడు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ 20 ఓవర్లలో 146 పరుగులకే కుప్పకూలింది. రసిక్ సలామ్‌(4/24)తో పాటు స్వింగ్ కింగ్ భువనేశ్వర్ కుమార్(3/27) మూడు వికెట్లు తీయగా.. కృనాల్ పాండ్యా(2/36) రెండు వికెట్లు పడగొట్టాడు. జోష్ హజెల్‌వుడ్‌కు ఒక వికెట్ దక్కింది.

లక్నో బ్యాటర్లలో మిచెల్ మార్ష్(32 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 40), ఆయుష్ బదోని(24 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 38), ముకుల్ చౌదరి(28 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 39) టాప్ స్కోరర్లుగా నిలవగా.. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు.

IPL 2026 Virat Kohli Gritty 49 and Rasikh Salam s Four-Fer Power RCB to Clinical 5-Wicket Win Over LSG

అనంతరం ఆర్‌సీబీ 15.1 ఓవర్లలో 5 వికెట్లకు 149 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. విరాట్ కోహ్లీ(34 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 49) తృటిలో హాఫ్ సెంచరీ చేజార్చుకోగా.. రజత్ పటిదార్(13 బంతుల్లో ఫోర్, 3 సిక్స్‌లతో 27), జితేష్ శర్మ(9 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 23) దూకుడుగా ఆడారు. లక్నో బౌలర్లలో ప్రిన్స్ యాదవ్(3/32) మూడు వికెట్లు తీయగా.. ఆవేష్ ఖాన్(2/23) రెండు వికెట్లు పడగొట్టాడు. ఈ విజయంతో ఆర్‌సీబీ పాయింట్స్ టేబుల్‌లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది.

గెలిపించిన కోహ్లీ..

146 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో ఆర్‌సీబీకి ఆశించిన శుభారంభం దక్కలేదు. రెండో ఓవర్‌లోనే ఫిల్ సాల్ట్(7) వెనుదిరిగాడు. ఈ పరిస్థితుల్లో విరాట్ కోహ్లీ అద్భుతమైన బ్యాటింగ్‌తో లక్నో బౌలర్లపై విరుచుకుపడ్డాడు. పవర్ ప్లేలో దూకుడుగా ఆడి జట్టు విజయాన్ని ఖాయం చేశాడు. బ్యాటింగ్‌కు ప్రతికూలంగా ఉన్న వికెట్‌పై కోహ్లీ 49 పరుగులు చేయడంతో ఆర్‌సీబీ విజయం లాంఛనమైంది.

ఆ తర్వాత బ్యాటర్లు వరుసగా వికెట్లు కోల్పోయినా.. ఆర్‌సీబీ సునాయస విజయాన్నందుకుంది. కోహ్లీ కూడా ఆరంభంలోనే ఔటై ఉంటే మ్యాచ్ మరింత ఉత్కంఠగా సాగేది. అయితే లక్నో బ్యాటర్లు కూడా 20-30 పరుగులు తక్కవగా చేశారు. ఆర్‌సీబీ బౌలర్ల అద్భుత ప్రదర్శనతో లక్నో బ్యాటర్లు వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు.

Story first published: Wednesday, April 15, 2026, 23:06 [IST]
Other articles published on Apr 15, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+