Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

PBKS vs RCB: చెలరేగిన వెంకటి.. పంజాబ్ ముందు భారీ లక్ష్యం!

ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) 223 పరుగుల భారీ లక్ష్యాన్ని నమోదు చేసింది. వెంకటేశ్ అయ్యర్(40 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్స్‌లతో 73 నాటౌట్), విరాట్ కోహ్లీ(37 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 58) హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో ముందుగా బ్యాటంగ్ చేసిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 222 పరుగులు చేసింది.

దేవదత్ పడిక్కల్(25 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 45)పర్వాలేదనిపించాడు. టీమ్ డేవిడ్(12 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 28) మెరుపులు మెరిపించాడు. పంజాబ్ బౌలర్లలో హర్‌ప్రీత్ బ్రార్(2/35) రెండు వికెట్లు తీయగా.. యుజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్ చెరో వికెట్ తీసారు.

IPL 2026 Virat Kohli and Venkatesh Iyer Masterclass Powers RCB to a Mammoth 222 4 Against PBKS

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆర్‌సీబీకి ఆశించిన ఆరంభం దక్కలేదు. జాకోబ్ బెతెల్(11) మరోసారి తీవ్రంగా నిరాశపర్చాడు. విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్ దూకుడుగా ఆడటంతో పవర్ ప్లేలో ఆర్‌సీబీ వికెట్ నష్టానికి 61 పరుగులు చేసింది. పవర్ ప్లే అనంతరం కూడాఈ జోడీ దూకుడుగా ఆడింది. ముఖ్యంగా దేవదత్ పడిక్కల్ భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. హాఫ్ సెంచరీ చేరువైనఅతన్ని హర్‌ప్రీత్ బ్రార్ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. దాంతో రెండో వికెట్‌కు నమోదైన 76 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.

వెంకటేశ్ అయ్యర్‌తో కలిసి కోహ్లీ తన జోరు కొనసాగించాడు. 31 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నకోహ్లీని చాహల్ పెవిలియన్ చేర్చాడు. టీమ్ డేవిడ్‌తో కలిసి వెంకటేశ్ అయ్యర్ చెలరేగాడు. 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. టీమ్ డేవిడ్ దూకుడుగా ఆడటంతో ఆర్‌సీబీ భారీ స్కోర్ చేసింది. ఆఖరి బంతికి టీమ్ డేవిడ్ క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు.

Story first published: Sunday, May 17, 2026, 17:35 [IST]
Other articles published on May 17, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+