For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2026: విరాట్ కోహ్లీ విధ్వంసం.. SRHపై ఆర్‌సీబీ ఘన విజయం!

ఐపీఎల్ 2026 సీజన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) శుభారంభం చేసింది. శనివారం చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన ఈ సీజన్ ఆరంభ మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన ఆర్‌సీబీ 6 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌‌ను ఓడించింది. టాపార్డర్ వైఫల్యం, పేలవ బౌలింగ్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ మూల్యం చెల్లించుకుంది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 201 పరుగులు చేసింది. కెప్టెన్ ఇషాన్ కిషన్(38 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్స్‌లతో 80) విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగగా.. అనికేత్ వర్మ(18 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 43), హెన్రీచ్ క్లాసెన్(22 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 31) దూకుడుగా ఆడారు. ఆర్‌సీబీ బౌలర్లలో జాకోబ్ డఫీ(3/22), రొమారియో షెఫెర్డ్(3/54) మూడేసి వికెట్లు తీయగా.. భువనేశ్వర్ కుమార్, అభినందన్ సింగ్, సుయాష్ శర్మ తలో వికెట్ తీసారు.

IPL 2026 Virat Kohli and Devdutt Padikkal Smashed Fifties as RCB Thrashed SRH by 6 Wickets in Season Opener

అనంతరం ఆర్‌సీబీ 15.4 ఓవర్లలో 4 వికెట్లకు 203 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. దేవదత్ పడిక్కల్(26 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్‌లతో 61), విరాట్ కోహ్లీ(38 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్‌లతో 69 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించగా.. రజత్ పటీదార్(12 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 31) దూకుడుగా ఆడారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో డేవిన్ పైన్ రెండు వికెట్లు తీయగా.. జయదేవ్ ఉనాద్కత్, హర్ష్ దూబే చెరో వికెట్ తీసారు.

ఆర్‌సీబీ ఓపెనర్ ఫిల్ సాల్ట్(8) బ్యాటింగ్‌లో విఫలమైనా.. స్టన్నింగ్ ఫీల్డింగ్‌తో ఆర్‌సీబీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. అతను అందుకున్న మూడు క్యాచ్‌లు సన్‌రైజర్స్ హైదరాబాద్ పతనాన్ని శాసించాయి. ముఖ్యంగా హెన్రీచ్ క్లాసెన్, ఇషాన్ కిషన్ క్యాచ్‌లు మ్యాచ్‌కు టర్నింగ్ పాయింట్‌గా నిలిచాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ తదుపరి మ్యాచ్‌ను కేకేఆర్‌తో గురువారం(ఏప్రిల్ 2న) ఆడనుండగా.. ఆర్‌సీబీ తమ రెండో మ్యాచ్‌లో సీఎస్‌కేతో ఏప్రిల్ 5న తలపడనుంది.

Story first published: Saturday, March 28, 2026, 23:13 [IST]
Other articles published on Mar 28, 2026
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+