Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Vaibhav Sooryavanshi: చరిత్ర సృష్టించిన బేబీ బాస్.. క్రిస్ గేల్ ఆల్‌టైమ్ రికార్డ్ బద్దలు..!

రాజస్థాన్ రాయల్స్ టీనేజ్ సెన్సేషన్, యూనివర్సల్ బేబీ బాస్ వైభవ్ సూర్యవంశీ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలోనే ఒక సీజన్‌లో అత్యధిక సిక్స్‌లు బాదిన బ్యాటర్‌గా నిలిచాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా బుధవారం సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH)తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో 12 సిక్స్‌లు బాదడం ద్వారా ఈ ఫీట్ సాధించాడు. ముల్లాన్‌పూర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 29 బంతుల్లో 5 ఫోర్లు, 12 సిక్స్‌లతో 97 పరుగులు చేసి తృటిలో శతకాన్ని చేజార్చుకున్నాడు. ఈ ఇన్నింగ్స్‌తో యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ ఆల్‌టైమ్ రికార్డ్ బద్దలు కొట్టాడు.

ఐపీఎల్ 2012 సీజన్‌లో క్రిస్ గేల్ 59 సిక్సర్లు బాదాడు. గత 14 ఏళ్లుగా ఈ రికార్డ్ చెక్కుచెదరకుండా ఉండగా.. తాజా సీజన్‌లో వైభవ్ సూర్యవంశీ 65 సిక్సర్లతో అధిగమించాడు. తన విధ్వంసకర ఇన్నింగ్స్‌తో అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.

IPL 2026 15-Year-Old Vaibhav Sooryavanshi Smashes Chris Gayle s Historic Record Earns Universe Baby Boss Label

ఒక ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక సిక్సర్లు

65* - వైభవ్ సూర్యవంశీ (2026)

59 - క్రిస్ గేల్ (2012)

52 - ఆండ్రీ రస్సెల్ (2019)

51 - క్రిస్ గేల్ (2013)

45 - జోస్ బట్లర్ (2022)

ఐపీఎల్ నాకౌట్స్/ప్లేఆఫ్స్‌లో అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీలు (బంతుల పరంగా)

16 - సురేష్ రైనా వర్సెస్ పీబీకేఎస్ (PBKS), వాంఖడే, 2014

16 - వైభవ్ సూర్యవంశీ వర్సెస్ ఎస్‌ఆర్‌హెచ్ (SRH), ముల్లాన్‌పూర్, 2026*

17 - ఆడమ్ గిల్‌క్రిస్ట్ వర్సెస్ డీసీ (DC), సెంచూరియన్, 2009

20 - ఎంఎస్ ధోని వర్సెస్ ఎంఐ (MI), బెంగళూరు, 2012

21 - డ్వేన్ స్మిత్ వర్సెస్ సీఎస్‌కే (CSK), ఢిల్లీ, 2013

21 - వీరేంద్ర సెహ్వాగ్ వర్సెస్ సీఎస్‌కే (CSK), వాంఖడే, 2014

21 - రజత్ పటీదార్ వర్సెస్ జీటీ (GT), ధర్మశాల, 2026

ఐపీఎల్‌లో 20 కంటే తక్కువ బంతుల్లో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన బ్యాటర్లు

6 - అభిషేక్ శర్మ

5 - నికోలస్ పూరన్

5 - వైభవ్ సూర్యవంశీ*

ఒక ఐపీఎల్ ఇన్నింగ్స్‌లో 10 లేదా అంతకంటే ఎక్కువ సిక్సర్లు కొట్టిన బ్యాటర్లు

4 - క్రిస్ గేల్

4 - వైభవ్ సూర్యవంశీ*

2 - అభిషేక్ శర్మ

2 - ఫిన్ అలెన్

ఒక ఐపీఎల్ ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత బ్యాటర్లు

12 - వైభవ్ సూర్యవంశీ (ఆర్‌ఆర్) వర్సెస్ ఎస్‌ఆర్‌హెచ్, 2026

12 - వైభవ్ సూర్యవంశీ (ఆర్‌ఆర్) వర్సెస్ ఎస్‌ఆర్‌హెచ్, 2026 ఎలిమినేటర్ (ELM)

11 - మురళీ విజయ్ (సీఎస్‌కే) వర్సెస్ ఆర్‌ఆర్, 2010

11 - వైభవ్ సూర్యవంశీ (ఆర్‌ఆర్) వర్సెస్ జీటీ, 2025

ఒక ఐపీఎల్ సీజన్‌లో అన్‌క్యాప్డ్ భారత బ్యాటర్ చేసిన అత్యధిక పరుగులు

680 - వైభవ్ సూర్యవంశీ (ఆర్‌ఆర్, 2026)*

625 - యశస్వి జైస్వాల్ (ఆర్‌ఆర్, 2023)

616 - షాన్ మార్ష్ (పీబీకేఎస్, 2008)

573 - రియాన్ పరాగ్ (ఆర్‌ఆర్, 2024)

549 - ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (పీబీకేఎస్, 2025)

Story first published: Wednesday, May 27, 2026, 20:50 [IST]
Other articles published on May 27, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+