Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Vaibhav Sooryavanshi: గోల్డెన్ డక్‌కు పగ తీర్చుకున్న బుడ్డోడు!

రాజస్థాన్ రాయల్స్(RR) టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర శతకంతో చెలరేగాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH)‌తో శనివారం జైపూర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఈ 15 ఏళ్ల కుర్రాడు 36 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. ఈ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై కసితీరా పగ తీర్చుకున్నాడు.

ఈ సీజన్‌లో ఉప్పల్ వేదికగా జరిగిన గత మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ డకౌట్ అయ్యాడు. సన్‌రైజర్స్ అనామక పేసర్ ప్రఫుల్ హింగే బౌలింగ్‌లో గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగాడు. కానీ ఈ మ్యాచ్‌లో ప్రఫుల్ హింగేతో పాటు సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌పై వైభవ్ సూర్యవంశీ విరుచుకుపడ్డాడు.

ప్రఫుల్ హింగే వేసిన తొలి ఓవర్‌లో వరుసగా 4 సిక్స్‌లు బాది.. గత మ్యాచ్ డకౌట్‌కు బదులు తీర్చుకున్నాడు. ప్యాట్ కమిన్స్ బౌలింగ్‌లో తాను ఎదుర్కొన్న తొలి బంతినే వైభవ్ సిక్సర్ బాది తన ఫియర్‌లెస్ గేమ్‌ను చాటుకున్నాడు. విధ్వంసకర బ్యాటింగ్‌తో 15 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్న వైభవ్ సూర్యవంశీ.. 36 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

IPL 2026 Vaibhav Sooryavanshi Smashes 36-Ball Century to Avenge Golden Duck Against SRH and Praful Hinge

ఈ శతకాన్ని వైభవ్ వినూత్నంగా సెలెబ్రేట్ చేసుకున్నాడు. లవ్ యూ రాజస్థాన్ రాయల్స్ అని సైగలు చేశాడు. ఐపీఎల్ మూడో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డ్ అందుకున్నాడు. రెండో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డ్(35 బంతుల్లో) కూడా వైభవ్ పేరిట ఉన్న సంగతి తెలిసిందే.

జస్‌ప్రీత్ బుమ్రా, జోష్ హజెల్ వుడ్, భువనేశ్వర్ కుమార్, కగిసో రబడా వంటి వరల్డ్ క్లాస్ బౌలర్లు చితక్కొట్టిన ఈ బుడ్డోడు.. తాజా మ్యాచ్‌లో కమిన్స్‌కు కూడా తన బ్యాటింగ్ రుచి చూపించాడు. వైభవ్ విధ్వంసకర శతకంతో ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 228 పరుగుల భారీ స్కోర్ చేసింది.

వైభవ్ సూర్యవంశీ(37 బంతుల్లో 5 ఫోర్లు, 13 సిక్స్‌లతో 103) విధ్వంసకర శతకానికి తోడుగా ధ్రువ్ జురెల్(35 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్‌తో 51) హాఫ్ సెంచరీతో రాణించాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో ఇషాన్ మలింగా(2/38) రెండు వికెట్లు తీయగా.. ప్యాట్ కమిన్స్, సకీబ్ హుస్సేన్, నితీష్ కుమార్ రెడ్డి, ప్రఫుల్ హింగేలకు తలో వికెట్ తీసారు.

Story first published: Saturday, April 25, 2026, 21:40 [IST]
Other articles published on Apr 25, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+