IPL 2026: బుడ్డోడిదే ఆరెంజ్ క్యాప్.. 19 ఏళ్లలో ఒకే ఒక్కడిగా..!
రాజస్థాన్ రాయల్స్ టీనేజ్ సెన్సేషన్, యూనివర్సల్ బేబీ బాస్ వైభవ్ సూర్యవంశీ చరిత్ర సృష్టించాడు. 19 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలోనే ఆరెంజ్ క్యాప్ అందుకున్న అత్యంత పిన్నవయస్కుడిగా వైభవ్ నిలిచాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో 776 పరుగులతో టాస్ స్కోరర్‌గా నిలవడంతో ఈ ఫీట్ సాధించాడు. తద్వార సాయి సుదర్శన్ పేరిట ఉన్న రికార్డ్‌ను వైభవ్ అధిగమించాడు.
వైభవ్ 15 ఏళ్ల 65 రోజుల వయసులో ఆరెంజ్ క్యాప్ అందుకుంటే.. సాయి సుదర్శన్ 23 ఏళ్ల 231 రోజుల వయసులో ఈ ఫీట్ సాధించాడు. శుభ్‌మన్ గిల్ 23 ఏళ్ల 263 రోజుల వయసులో, రుతురాజ్ గైక్వాడ్ 24 ఏళ్ల 357 రోజుల వయసులో ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు.

ఈ సీజన్‌లో 16 మ్యాచ్‌ల్లో 48.50 సగటుతో 776 పరుగులు చేసిన వైభవ్ సూర్యవంశీ.. ఒక సెంచరీతో పాటు ఐదు హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. ఇందులో మూడు సార్లు 90+ స్కోర్లలో ఔటయ్యాడు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)తో జరుగుతున్న ఫైనల్లో సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ విఫలమవడంతో వైభవ్ సూర్యవంశీకి ఆరెంజ్ క్యాప్ ఖరారైంది. ఈ సీజన్‌లో టాప్ స్కోరర్ల లిస్ట్‌లో వైభవ్ సూర్యవంశీ(776) తర్వాత శుభ్‌మన్ గిల్(722), సాయి సుదర్శన్(710), హెన్రీచ్ క్లాసెన్(624) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
ఐపీఎల్ సీజన్ల వారిగా ఆరెంజ్ క్యాప్ విన్నర్లు..
IPL 2008: షాన్ మార్ష్ (KXIP) - 616 రన్స్
IPL 2009: మాథ్యూ హేడెన్ (CSK) - 572 రన్స్
IPL 2010: సచిన్ టెండూల్కర్ (MI) - 618 రన్స్
IPL 2011: క్రిస్ గేల్ (RCB) - 608 రన్స్
IPL 2012: క్రిస్ గేల్ (RCB) - 733 రన్స్
IPL 2013: మైఖేల్ హస్సీ (CSK) - 733 రన్స్
IPL 2014: రాబిన్ ఉతప్ప (KKR) - 660 రన్స్
IPL 2015: డేవిడ్ వార్నర్ (SRH) - 562 రన్స్
IPL 2016: విరాట్ కోహ్లీ (RCB) - 973 రన్స్
IPL 2017: డేవిడ్ వార్నర్ (SRH) - 641 రన్స్
IPL 2018: కేన్ విలియమ్సన్ (SRH) - 735 రన్స్
IPL 2019: డేవిడ్ వార్నర్ (SRH) - 692 రన్స్
IPL 2020: కేఎల్ రాహుల్ (PBKS) - 670 రన్స్
IPL 2021: రుతురాజ్ గైక్వాడ్ (CSK) - 635 రన్స్
IPL 2022: జోస్ బట్లర్ (RR) - 863 రన్స్
IPL 2023: శుభ్‌మన్ గిల్ (GT) - 890 రన్స్
IPL 2024: విరాట్ కోహ్లీ (RCB) - 741 రన్స్
IPL 2025: సాయి సుదర్శన్ (GT) - 759 రన్స్
IPL 2026: వైభవ్ సూర్యవంశీ (RR) - 776 రన్స్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications