సెంచరీ గురించి ఆలోచించలేదు: వైభవ్ సూర్యవంశీ
తాను సెంచరీ గురించి అస్సలు ఆలోచించలేదని రాజస్థాన్ రాయల్స్ టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ అన్నాడు. షాట్ మిస్‌టైమ్ అయిందనే బాధపడ్డానని, సెంచరీ గురించి కాదని స్పష్టం చేశాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా బుధవారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో యూనివర్సల్ బేబీ బాస్ వైభవ్ సూర్యవంశీ( 29 బంతుల్లో 5 ఫోర్లు, 12 సిక్సర్లతో 97) విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగాడు. తృటిలో శతకంతో పాటు వరల్డ్ రికార్డ్ చేజార్చుకున్నాడు.
వైభవ్ సూర్యవంశీ విధ్వంసంతో ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 243 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇన్నింగ్స్ బ్రేక్ సమయంలో అధికారిక బ్రాడ్‌కాస్టర్‌తో మాట్లాడిన వైభవ్ సూర్యవంశీ.. ఎలిమినేటర్ మ్యాచ్ అని ఏ మాత్రం ఒత్తిడికి గురికాలేదని, స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశానని వెల్లడించాడు.

'ఇది బిగ్ మ్యాచ్ అని నేను అనుకోలేదు. కానీ నా మనసులో ఎక్కడో ఆ ఆలోచన అయితే ఉంది. కానీ మా కోచ్‌లంతా నేను ప్రాక్టీస్ సెషన్‌లో ఎలాగైతే ఆడుతున్నానో అలానే ఆడమని, ఆటను ఆస్వాదించమని, ఈ మ్యాచ్ కోసం ఎలాంటి ఒత్తిడి తీసుకోకూడదని చెప్పారు. నాకు బౌండరీలు ఏం చిన్నవిగా అనిపించలేదు. నేను ఔటైన తర్వాత కూడా 260+ పరుగులు చేయడం సాధ్యమేనని అనిపించింది. కానీ మా దగ్గర ఎంత స్కోర్ ఉన్నా దాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తాం. మా ప్రణాళికలను సరిగ్గా అమలు చేస్తాం.
నేను సెంచరీ గురించి అస్సలు ఆలోచించలేదు. కానీ అక్కడ ఫీల్డర్‌ను చూసిన తర్వాతే ఆ షాట్ ఆడాను. కానీ అది మిస్‌టైమ్ అయ్యింది. ఒకవేళ నేను థర్డ్ మ్యాన్‌వైపు ఆడి ఉంటే.. అది సులువుగా బౌండరీ దాటేసేది. కానీ స్ట్రెయిట్‌గా కొట్టడానికి ప్రయత్నించాను. అందుకే షాట్ మిస్‌టైమ్ అయ్యింది. దాంతోనే బాధపడ్డాను. సెంచరీ గురించి కాదు.'అని వైభవ్ సూర్యవంశీ చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications