రూ.100 ఇస్తేనే ఫొటో.. వైభవ్ సూర్యవంశీ కండీషన్(వీడియో)
రాజస్థాన్ రాయల్స్ టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 15 ఏళ్ల వయసులోనే విధ్వంసకర బ్యాటింగ్‌తో అభినవ సచిన్‌గా విమర్శకుల ప్రశంసలు అందుకున్న సూర్యవంశీ.. భారత క్రికెట్ ముఖ చిత్రంగా ఎదుగుతున్నాడు.
తనకే సాధ్యమైన ఫియర్‌లెస్ గేమ్‌తో వరల్డ్ క్లాస్ బౌలర్లను కూడా ఆర్డినరిగా మార్చేస్తున్నాడు. రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ప్రధాన ఆటగాడిగా మారాడు. ఎంతలా అంటే వైభవ్ చెలరేగితేనే ఆ జట్టు గెలిచే పరిస్థితిని తీసుకొచ్చాడు. దాంతో ఈ బుడ్డోడికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చింది.
తాజాగా తనతో ఫొటో దిగేందుకు వచ్చిన ఇద్దరు పిల్లలను వైభవ్ సూర్యవంశీ ఆటపట్టించాడు. తాను ఫొటో దిగేందుకు డబ్బులు తీసుకుంటానని, ఒక్కో దానికి రూ.100 ఇవ్వాలని ఫన్నీగా అడిగారు. దీంతో ఆ పిల్లలు రూ. 200 తెచ్చామని చెప్పడంతో అక్కడ ఉన్న వారందరూ నవ్వేశారు.

దీంతో వైభవ్ తాను తమాషాగా అన్నానని చెప్పి, ఫొటో దిగి పంపించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను రాజస్థాన్ రాయల్స్ సోషల్ మీడియా వేదికగా పంచుకోగా వైరల్‌గా మారింది. పిల్లాడే పిల్లలతో ఆడుతున్నాడని ఒకరంటే.. వైభవ్ సూర్యవంశీ ప్రాంక్ స్టార్‌గా మాట్లాడాడని మరొకరు కామెంట్ చేస్తున్నారు.
సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన గత మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ సెంచరీతో చెలరేగిన సంగతి తెలిసిందే. సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్, వరల్డ్ క్లాస్ బౌలర్ పాట్ కమిన్స్ బౌలింగ్‌లో ఫస్ట్ బాల్‌నే ఈ బుడ్డోడు సిక్సర్ బాదాడు. బుమ్రా, హాజెల్ వుడ్, భువనేశ్వర్ కుమార్, రబడా బౌలింగ్‌లోనూ తొలి బంతిని బౌండరీకి తరలించిన బుడ్డోడు.. కమిన్స్ కూడా తన బ్యాటింగ్ రుచి చూపించాడు. వైభవ్ బ్యాటింగ్‌కు ఫిదా అయిన కమిన్స్.. తన ఫేవరేట్ ప్లేయర్ అని ప్రశంసల జల్లు కురిపించాడు.
మహమ్మద్ కైఫ్ అయితే మరో 25 ఏళ్ల పాటు వైభవ్ సూర్యవంశీ భారత క్రికెట్‌ను ఏలుతాడని జోస్యం చెప్పాడు. గల్లీ క్రికెట్ ఆడినంత ఈజీగా ఐపీఎల్ ఆడుతున్నాడని కొనియాడాడు. తరానికొక్క ప్లేయర్ వైభవ్ సూర్యవంశీ అని ప్రశంసించాడు. టీమిండియా మాజీ కెప్టెన్ క్రిష్ శ్రీకాంత్ ఈ బుడ్డోడిని సచిన్ టెండూల్కర్‌తో పోల్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications