IPL 2026: రాకాసి యార్కర్.. క్రీజులో కుప్పకూలిన వైభవ్ సూర్యవంశీ! (వీడియో)
రాజస్థాన్ రాయల్స్ టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ తీవ్రంగా గాయపడ్డాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో మహహ్మద్ సిరాజ్ వేసిన యార్కర్‌ను ఆడబోయి తనను తాను గాయపర్చుకున్నాడు. యార్కర్‌ను బలంగా కొట్టే క్రమంలో బంతి అతని కాలికి బలంగా తాకింది. దాంతో తీవ్ర నొప్పితో విలవిలలాడిన ఈ 15 ఏళ్ల కుర్రాడు.. క్రీజులోనే కుప్పకూలాడు.
ఫిజియోలు వచ్చిన వైభవ్ సూర్యవంశీకి చికిత్స అందించారు. అతని పాదానికి టేప్ వేసారు. దాంతో వైభవ్ సూర్యవంశీ తిరిగి బ్యాటింగ్ మొదలుపెట్టాడు. బంతి తగిలిన నొప్పినో లేక మరే కారణమో తెలియదు కానీ మరింత కసిగా గుజరాత్ టైటాన్స్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు.

ఈ మ్యాచ్‌లోనూ వైభవ్ సూర్యవంశీ ఎదుర్కొన్న తొలి బంతినే సిక్సర్‌గా తరలించాడు. మహమ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో లాంగాన్ దిశగా సిక్సర్ తరలించాడు. దాంతో తీవ్ర ఆగ్రహానికి గురైన సిరాజ్.. మరుసటి బంతినే యార్కర్ సంధించి గాయపర్చాడు. కానీ వైభవ్ మాత్రం వెనక్కి తగ్గలేదు. కగిసో రబాడా బౌలింగ్‌లో వరుసగా రెండు సిక్స్‌లు బాదిన బుడ్డోడు.. సిరాజ్ బౌలింగ్‌లో మూడు బౌండరీలు బాది క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. వైభవ్ సూర్యవంశీని ఔట్ చేసిన అనంతరం సిరాజ్ గట్టిగా అరుస్తూ సంబరాలు చేసుకున్నాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 229 పరుగులు చేసింది. సాయి సుదర్శన్(36 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 55), శుభ్‌మన్ గిల్(44 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 84) హాఫ్ సెంచరీలతో రాణించగా.. వాషింగ్టన్ సుందర్(20 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 37 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో బ్రిజేష్ శర్మ రెండు వికెట్లు తీయగా.. యష్‌రాజ్ పుంజా, రవీంద్ర జడేజా తలో వికెట్ తీసారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications