Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2026: కొంపముంచిన బేబీ బాస్.. SRH ఎలిమినేట్!

ఐపీఎల్ 2026 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) పోరాటం ముగిసింది. అనూహ్య పరాజయం‌తో ఇంటిబాట పట్టింది. రాజస్థాన్ రాయల్స్‌తో బుధవారం ముల్లాన్‌పూర్ వేదికగా జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో సమష్టిగా విఫలమైన సన్‌రైజర్స్ హైదరాబాద్ 47 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది.

SRH అభిమానులు ఏదైతే జరగకూడదని కోరుకున్నారో అదే జరింగింది. యూనివర్సల్ బేబీ బాస్ వైభవ్ సూర్యవంశీ(29 బంతుల్లో 5 ఫోర్లు, 12 సిక్సర్లతో 97) విధ్వంసకర బ్యాటింగ్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ పతనాన్ని శాసించాడు. ఈ విజయంతో రాజస్థాన్ రాయల్స్ క్వాలిఫయర్-2కు అర్హత సాధించింది. శుక్రవారం ముల్లాన్‌పూర్ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌తో రాజస్థాన్ రాయల్స్ అమీతుమీ తేల్చుకోనుంది.

వైభవ్ ఊచకోత..

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 243 పరుగుల భారీ స్కోర్ చేసింది. వైభవ్ సూర్యవంశీతో పాటు ధ్రువ్ జురెల్(21 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 50) హాఫ్ సెంచరీతో రాణించాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో ప్రఫుల్ హింగే(3/54) మూడు వికెట్లు తీయగా.. ఇషాన్ మలింగా, శివాంగ్ కుమార్, నితీష్ కుమార్ రెడ్డి తలో వికెట్ పడగొట్టారు.

IPL 2026 Vaibhav Sooryavanshi Explosive 97 and SRH s Batting Flop Show Help RR Eliminate Sunrisers

అనంతరం సన్‌రైజర్స్ హైదరాబాద్ 19.1 ఓవర్లలో 196 పరుగులకు ఆలౌటై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఇషాన్ కిషన్(11 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 33), నితీష్ కుమార్ రెడ్డి(20 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 38), సలీల్ అరోరా(21 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 35) రాణించగా మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్(3/58) మూడు వికెట్లు తీయగా.. నండ్రే బర్గర్, సుశాంత్ మిశ్రా, రవీంద్ర జడేజా రెండేసి వికెట్లు పడగొట్టారు. యశ్‌రాజ్ పుంజా ఒక వికెట్ తీసాడు.

చేతులెత్తేసిన కాటేరమ్మ కొడుకులు..

భారీ లక్ష్యఛేధనలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌‌కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. జోఫ్రా ఆర్చర్ వేసిన తొలి ఓవర్‌లోనే అభిషేక్ శర్మ సిల్వర్ డకౌట్‌గా వెనుదిరిగాడు. ఆర్చర్ మరుసటి ఓవర్‌లో దూకుడుగా ఆడిన ఇషాన్ కిషన్ క్యాచ్ ఔటయ్యాడు. రవిచంద్రన్ స్మరణ్‌(1)ను అప్‌ది ఆర్డర్ పంపిస్తూ ఆరెంజ్ ఆర్మీ చేసిన ప్రయోగం విఫలమైంది. బర్గర్ బౌలింగ్‌లో స్మరణ్ వెనుదిరగ్గా..ట్రావిస్ హెడ్‌(17)ను ఆర్చర్ క్లీన్ బౌల్డ్ చేశాడు. దాంతో పవర్ ప్లేలోనే సన్‌రైజర్స్ హైదరాబాద్ 4 వికెట్లు కోల్పోయి ఓటమికి తల వంచింది.

నితీష్ రెడ్డి మినహా..

హెన్రీచ్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి ఇన్నింగ్స్ నిలబెట్టే ప్రయత్నం చేసినా.. యశ్‌రాజ్ పుంజా దెబ్బకొట్టాడు. డేంజరస్ క్లాసెన్‌(18)ను వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు. ఈ పరిస్థితుల్లో సలీల్ అరోరాతో కలిసి నితీష్ కుమార్ రెడ్డి పోరాడాడు. ఆచితూచి ఆడిన ఈ జోడీ వీలుచిక్కిన బంతిని బౌండరీకి తరలించింది. కానీ ఛేదించాల్సిన రన్‌రేట్ పెరిగిపోతుండటంతో దూకుడుగా ఆడాలనే ఒత్తిడిలో ఈ ఇద్దరూ వరుస ఓవర్లలో పెవిలియన్ చేరారు.

ఈ ఇద్దర్నీ జడేజా తన వరుస ఓవర్లలో క్యాచ్ ఔట్‌‌గా పెవిలియన్ చేర్చాడు. ప్యాట్ కమిన్స్(1)ను మిశ్రా పెవిలియన్ చేర్చడంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓటమి ఖాయమైంది. రాజస్థాన్ బౌలర్ల సహనాన్ని శివాంగ్ కుమార్(27) పరీక్షించాడు. అతన్ని మిశ్రా ఔట్ చేసి రాజస్థాన్ విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు.

Story first published: Wednesday, May 27, 2026, 23:30 [IST]
Other articles published on May 27, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+