Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ.. అభిషేక్ శర్మ రికార్డ్ బద్దలు!

రాజస్థాన్ రాయల్స్ టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలోనే ఓ సీజన్‌లో అత్యధిక సిక్స్‌లు బాదిన భారత బ్యాటర్‌గా నిలిచాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో 3 సిక్స్‌లు బాదడం ద్వారా ఈ ఫీట్ సాధించాడు. తద్వారా సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ రికార్డ్‌ను అధిగమించాడు.

ఐపీఎల్ 2024 సీజన్‌లో అభిషేక్ శర్మ 42 సిక్స్‌లు బాదగా.. వైభవ్ సూర్యవంశీ తాజా సీజన్‌లో మొత్తం 43 సిక్స్‌లతో అతన్ని అధిగమించాడు. ఈ జాబితాలో వైభవ్(43), అభిషేక్ శర్మ(42) తర్వాత శ్రేయస్ అయ్యర్(39), విరాట్ కోహ్లీ (38), సూర్యకుమార్ యాదవ్(38) తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు.

IPL 2026 Vaibhav Sooryavanshi Creates history Smashes Abhishek Sharma s All-Time Indian Record

ఐపీఎల్ 2025 సీజన్‌లో శ్రేయస్ అయ్యర్ 39 సిక్స్‌లు బాదగా.. విరాట్ కోహ్లీ 2016, 2024లో 38 సిక్స్‌లు కొట్టాడు. సూర్యకుమార్ యాదవ్ 2025లో 38 సిక్స్‌లు బాదాడు. ఈ సీజన్‌లో వైభవ్ సూర్యవంశీ మరో లీగ్ మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఒకవేళ ఆ జట్టు ప్లే ఆఫ్స్ చేరితే వైభవ్ సిక్సర్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

IPL 2026: పంజాబ్ కింగ్స్ ఔట్.. ప్లే ఆఫ్స్‌కు ఆర్‌సీబీ

IPL 2026: పంజాబ్ కింగ్స్ ఔట్.. ప్లే ఆఫ్స్‌కు ఆర్‌సీబీ

ఈ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ(24 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 46) తృటిలో హాఫ్ సెంచరీ చేజార్చుకోగా.. ధ్రువ్ జురెల్(40 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 53), కెప్టెన్ రియాన్ పరాగ్(26 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లతో 51) హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు. దాంతో ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 8 వికెట్లకు 193 పరుగులు చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో మిచెల్ స్టార్క్(4/40) నాలుగు వికెట్లు తీయగా.. లుంగి ఎంగిడి, మాధవ్ తివారి రెండేసి వికెట్లు పడగొట్టారు.

IPL 2026: ఆర్‌సీబీ చేతిలో పరాజయం.. పంజాబ్ కింగ్స్ ప్లే ఆఫ్స్ చేరాలంటే..?

IPL 2026: ఆర్‌సీబీ చేతిలో పరాజయం.. పంజాబ్ కింగ్స్ ప్లే ఆఫ్స్ చేరాలంటే..?
Story first published: Sunday, May 17, 2026, 22:37 [IST]
Other articles published on May 17, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+