IPL 2026: చెలరేగిన బేబీ బాస్.. 11 ఏళ్ల రికార్డ్ ఫసక్!
ఐపీఎల్ 2026 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ టీనేజ్ సెన్సేషన్, యూనివర్సల్ బాస్ వైభవ్ సూర్యవంశీ తన జోరును కొనసాగిస్తున్నాడు. తనకే సాధ్యమైన విధ్వంసకర బ్యాటింగ్‌తో రికార్డుల మోత మోగిస్తున్నాడు. తాజాగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచ్‌లోనూ చెలరేగిన వైభవ్.. పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. 47 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్స్‌లతో 96 పరుగులు చేసి తృటిలో శతకాన్ని చేజార్చుకున్న వైభవ్.. ఈ ఇన్నింగ్స్‌తో ఆల్‌టైమ్ రికార్డులను బద్దలు కొట్టాడు.
గత 11 ఏళ్లుగా చెక్కు చెదరకుండా ఉన్న రికార్డ్‌ను అధిగమించాడు. ఐపీఎల్ చరిత్రలోనే ఒకే సీజన్‌లో పవర్ ప్లేలో అత్యధిక పరుగులు చేసిన తొలి బ్యాటర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్‌ను అధిగమించాడు.

2016లో డేవిడ్ వార్నర్ పవర్ ప్లేలో 467 పరుగులు చేయగా.. తాజా సీజన్‌లో వైభవ్ సూర్యవంశీ 521 పరుగులతో సరికొత్త రికార్డ్‌ను లిఖించాడు. ఈ జాబితాలో వైభవ్, డేవిడ్ వార్నర్ తర్వాత ట్రావిస్ హెడ్(2024 సీజన్‌లో 402), సాయి సుదర్శన్(2025లో 402), ఆడమ్ గిల్‌క్రిస్ట్(2009లో 382) తర్వాతి స్థానంలో ఉన్నాడు.
టీ20 టోర్నీ చరిత్రలోనే పవర్ ప్లేలో 500 పరుగులు చేసిన తొలి బ్యాటర్‌గా కూడా వైభవ్ రికార్డ్ అందుకున్నాడు. సింగిల్ సీజన్‌లో అత్యధిక బౌండరీ బాదిన బ్యాటర్ల జాబితాలోనూ వైభవ్ సూర్యవంశీ అగ్రస్థానంలో నిలిచాడు. తాజా సీజన్‌లో వైభవ్ 62 ఫోర్లు, 67 సిక్స్‌లతో 129 బౌండరీలు బాదాడు. ఈ జాబితాలో జోస్ బట్లర్ 128 బౌండరీలతో రెండో స్థానంలో నిలిచాడు.
ఐపీఎల్ చరిత్రలోనే బంతుల పరంగా అత్యంత వేగంగా శతకం బాదిన తొలి బ్యాటర్‌గా వైభవ్ సూర్యవంశీ నిలిచాడు. 440 బంతుల్లోనే వైభవ్ ఈ ఫీట్ సాధించాడు. ఈ క్రమంలో ఆండ్రీ రస్సెల్ రికార్డ్‌ను అధిగమించాడు. అతను 545 బంతుల్లోనే ఈ ఫీట్ సాధించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications