IPL 2026: రాజస్థాన్‌ను గెలిపించిన వైభవ్ సూర్యవంశీ.. ప్లే ఆఫ్స్ ఆశలు సజీవం!
ఐపీఎల్ 2026 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ అద్భుత విజయాన్నందుకుంది. ప్లే ఆఫ్స్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఆ జట్టు అదరగొట్టింది. మంగళవారం జైపూర్ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన హైస్కోరింగ్ గేమ్‌లో వైభవ్ సూర్యవంశీ (38 బంతుల్లో 7 ఫోర్లు, 10 సిక్స్‌లతో 93) విధ్వంసంతో 7 వికెట్ల తేడాతో గెలుపొందింది.
ముంబై ఇండియన్స్‌తో జరిగే తమ ఆఖరి మ్యాచ్‌లో విజయం సాధిస్తే ఏ జట్టుతో సంబంధం లేకుండా రాజస్థాన్‌కు ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కుతుంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 220 పరుగులు చేసింది.

మిచెల్ మార్ష్(57 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్స్‌లతో 96) తృటిలో శతకం చేజార్చుకోగా.. జోష్ ఇంగ్లీస్(60 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 60), రిషభ్ పంత్(23 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 35) విలువైన పరుగులు చేశారు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో యశ్‌రాజ్ పుంజా రెండు వికెట్లు తీయగా.. జోఫ్రా ఆర్చర్ ఒక వికెట్ పడగొట్టాడు.
అనంతరం రాజస్థాన్ రాయల్స్ 19.1 ఓవర్లలో 3 వికెట్లకు 225 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. వైభవ్ సూర్యవంశీతో పాటు ధ్రువ్ జురెల్(38 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 53 నాటౌట్) రాణించాడు. యశస్వి జైస్వాల్(23 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్‌తో 43) విలువైన పరుగులు చేశాడు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో ఆకాష్ సింగ్, మోహ్‌సిన్ ఖాన్ తలో వికెట్ తీసారు.
బుడ్డోడి ఊచకోత..
221 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో వైభవ్ సూర్యవంశీ తనదైన శైలిలో విరుచుకుపడ్డాడు. తొలి బంతి నుంచే లక్నో బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. యశస్వి జైస్వాల్ కూడా బ్యాట్ ఝులిపించడంతో పవర్ ప్లేలోనే వికెట్ నష్టపోకుండా రాజస్థాన్ రాయల్స్ 71 పరుగులు చేసింది. వైభవ్ సూర్యవంశీ 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్నాడు.
ఆకాశ్ సింగ్ వేసిన 9వ ఓవర్‌లో రెండు సిక్స్‌లు మూడు ఫోర్లతో 24 పరుగులు పిండుకున్నాడు. యశస్వి జైస్వాల్ ఔటైనా.. ధ్రువ్ జురెల్ ఆ జోరును కొనసాగించాడు. సెంచరీ ముంగిట రనౌటయ్యే ప్రమాదం నుంచి వైభవ్ బయటపడినా అదే ఓవర్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. వైభవ్ ఔటైన తర్వాత మ్యాచ్ కాస్త ఉత్కంఠగా మారినా.. ధ్రువ్ జురెల్ ఏ తప్పిదం చేయకుండా మ్యాచ్‌ను ముగించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications