Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నేను పాలు తాగను సర్.. నాకు ఆ భయం మాత్రం పోలేదు: వైభవ్ సూర్యవంశీ

తాను ప్రస్తుతం పాలు తాగడం లేదని రాజస్థాన్ రాయల్స్ టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ అన్నాడు. అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన కనబర్చినా.. మైక్ పట్టుకోని మాట్లాడాలంటే భయంగా, ఒత్తిడిగా ఉంటుందని చెప్పాడు.

ఐపీఎల్ 2026 సీజన్‌లో ఆర్‌సీబీ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఆదివారం అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్లో సమష్టిగా రాణించిన ఆర్‌సీబీ 5 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్‌ను చిత్తు చేసి రెండో టైటిల్ అందుకుంది.

ఐదు అవార్డులతో..

ఈ సీజన్‌లో అద్భుత ప్రదర్శనతో వైభవ్ సూర్యవంశీ(776 పరుగులు) ఐదు అవార్డులు అందుకున్నాడు. ఆరెంజ్ క్యాప్‌తో పాటు అత్యధిక సిక్సర్లు, సూపర్ స్ట్రైకర్, మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్, ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ అవార్డులు అందుకున్నాడు. అనంతరం హోస్ట్ రవిశాస్త్రితో మాట్లాడాడు. రోజుకు ఎన్ని లీటర్ల పాలు తాగుతావని రవిశాస్త్రి సరదాగా ప్రశ్నించగా.. పాలు తాగను సర్ అని వైభవ్ బదులిచ్చాడు.

IPL 2026 Vaibhav Sooryavanshi Admits Facing More Pressure in Post-Match Interview Than on the Pitch
Photo Credit: X (twitter)

'ఇన్ని అవార్డులు గెలుచుకోవడం సంతోషంగానే ఉంది. కానీ ఇప్పుడు ఇంటర్వ్యూ కోసం మీతో మాట్లాడాలంటేనే భయంగా.. ఒత్తిడిగా ఉంది. కానీ ఇది చాలా గర్వించదగిన క్షణం. వచ్చే సీజన్‌లో ఇంతకంటే మెరుగైన ప్రదర్శన చేసేందుకు ప్రయత్నిస్తాను. ప్రస్తుతం నేను పాలు తాగడం లేదు(నవ్వుతూ). నేను ఎప్పుడూ నా సహజసిద్దమైన ఆటను ఆడేందుకే ప్రయత్నిస్తాను.

నా జోన్‌లో ఉంటే సిక్సరే..

మ్యాచ్‌లో పడే తొలి బంతి నా జోన్‌‌లో ఉంటే.. కొట్టగలను అనిపిస్తే.. నా పూర్తి శక్తితో ఆ బంతిని బౌండరీ దాటించడానికే ప్రయత్నిస్తాను. ఈ సీజన్‌లో ఒత్తిడితో కూడిన పరిస్థితుల్లో ఎలా ఆడాలో, మ్యాచ్ పరిస్థితులకు అనుగుణంగా నా ఆటను ఎలా మార్చుకోవాలో నేర్చుకున్నాను.

ప్రతి మ్యాచ్‌ను ఒకే రకమైన మైండ్ సెట్‌తో ఆడలేం. ఆట యొక్క పరిస్థితిని సరిగ్గా అర్థం చేసుకుని, జట్టుకు ఏం అవసరమో దానికి తగ్గట్టుగా ఆడాలి. ప్లేఆఫ్ మ్యాచ్‌లతో సహా ఈ సీజన్ అంతటా నేను ఈ విషయాలను చాలా బాగా నేర్చుకున్నాను.

ఫిట్‌నెస్‌‌పై ఫోకస్ పెట్టాలి..

నేను చాలా కాలం పాటు క్రికెట్ ఆడాలని అనుకుంటున్నాను. ఫిట్‌నెస్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. గాయాల బారిన పడకుండా జాగ్రత్తపడాలి. అందుకే భవిష్యత్తులో నా ఫిట్‌నెస్‌పై మరింత కష్టపడి పూర్తి శ్రద్ధ పెడతాను.
రాజస్థాన్ రాయల్స్ జట్టులో అందరూ నాకు చాలా సపోర్ట్ చేస్తారు. ఎల్లప్పుడూ వెన్నుతట్టి ప్రోత్సహిస్తారు. సీనియర్ ఆటగాళ్లు, సపోర్ట్ స్టాఫ్ నన్ను ఎంతగానో సపోర్ట్ చేస్తారు.

వీరంతా ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో అద్భుతంగా రాణించిన ఆటగాళ్లు కావడం వల్ల వారి నుంచి నేను ఎన్నో విషయాలు నేర్చుకునే అవకాశం దక్కింది. నిజంగా ఇలాంటి మంచి వాతావరణంలో ఉండటం చాలా సంతోషంగా ఉంది.'అని వైభవ్ సూర్యవంశీ చెప్పుకొచ్చాడు.

Story first published: Monday, June 1, 2026, 8:56 [IST]
Other articles published on Jun 1, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+