Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2026: టీమ్ డేవిడ్‌పై నిషేధం.. ఎందుకంటే..?

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) బ్యాటర్ టీమ్ డేవిడ్‌పై వేటు పడింది. ఐపీఎల్ నిబంధనలు ఉల్లంఘించడంతో మ్యాచ్ రిఫరీ జవగళ్ శ్రీనాథ్ కఠిన చర్యలు తీసుకున్నారు. లెవల్ 1 ఉల్లంఘన చేసినందుకు గాను అతని మ్యాచ్ ఫీజులో 50 శాతం విధించడంతో పాటు 2 డీమెరిట్ పాయింట్స్ కేటాయించారు.

ఆదివారం గుజరాత్ టైటాన్స్‌తో అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్లో టీమ్ డేవిడ్ అంపైర్ నితిన్ మీనన్ వైపు ఐస్ బ్యాగ్‌ను ప్రమాదకరంగా విసిరినట్లు తెలుస్తోంది. ఆర్‌సీబీ విజయానంతరం సంబరాల్లో భాగంగా టీమ్ డేవిడ్ ఈ తప్పిదం చేసినట్లు సమాచారం.

టీమ్ డేవిడ్ తన తప్పును ఒప్పుకొని మ్యాచ్ రిఫరీ శిక్షను అంగీకరించాడు. ఇప్పటికే అతని ఖాతాలో 3 డీమెరిట్ పాయింట్స్ ఉండటంతో మొత్త 5 పాయింట్లకు చేరింది. దాంతో ఐపీఎల్ 2027‌లో అతను ఒక మ్యాచ్ ఆడకుండా నిషేధం పడింది. వచ్చే ఏడాది ఆర్‌సీబీ తొలి మ్యాచ్‌ను టీమ్ డేవిడ్ ఆడలేడు.

IPL 2026 Tim David Handed One-Match Suspension After Aggressively Throwing Ice Bag at Umpire During RCB Celebrations

ఈ సీజన్‌లో టీమ్ డేవిడ్ నిబంధనలను ఉల్లంఘించడం ఇదే తొలిసారి కాదు. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ అంపైర్లతో టీమ్ డేవిడ్ అనుచితంగా ప్రవర్తించాడు. బంతి ఆకారంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ అంపైర్ల సహనంతో ఆడుకున్నాడు. వారికి బంతి ఇవ్వకుండా ఆలస్యం చేశాడు. చివరకు అంపైర్ల హెచ్చరికతో బంతిని ఇచ్చాడు. కానీ అతని చర్యవల్ల ఆటకు అంతరాయం కలిగింది. దాంతో మ్యాచ్ రిఫరీ అతని మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధించడంతో పాటు ఓ డీమెరిట్ పాయింట్ కేటాయించాడు.

ఐపీఎల్ 2026 ఫైనల్లో ఆర్‌సీబీ 5 వికెట్ల తేడాతో విజయం సాధించి రెండో టైటిల్ ముద్దాడిన సంగతి తెలిసిందే. ఈ సీజన్‌లో 16 మ్యాచ్‌లు ఆడిన టీమ్ డేవిడ్ 33.89 సగటుతో 305 పరుగులు చేశాడు. ఇందులో ఒక హాఫ్ సెంచరీ ఉంది. ఆర్‌సీబీ ఫినిషర్‌గా టీమ్ డేవిడ్ అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాడు. వరుసగా రెండు సీజన్లలోనూ అతను సత్తా చాటి ఆర్‌సీబీ టైటిల్స్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు.

Story first published: Tuesday, June 2, 2026, 8:28 [IST]
Other articles published on Jun 2, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+