IPL 2026: ‘మిడిల్ ఫింగర్’ వివాదం.. టీమ్ డేవిడ్‌పై నిషేధం!
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) విధ్వంసకర బ్యాటర్ టీమ్ డేవిడ్‌పై ఐపీఎల్ నిర్వాహకులు కఠిన చర్యలు తీసుకున్నారు. ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో విజయానంతరం అసభ్యకర సైగలతో టీమ్ డేవిడ్ అత్యుత్సాహం ప్రదర్శించాడు. ముంబై ఓటమిని ఎగతాళి చేస్తూ.. మిడిల్ ఫింగర్‌ను చూపించాడు.
ఈ చర్యను తీవ్ర నేరంగా పరిగణించిన రిఫరీ అతని మ్యాచ్ ఫీజులో 30 శాతం కోత విధించడంతో పాటు రెండు డీమెరిట్ పాయింట్స్ కేటాయించారు. దాంతో టీమ్ డేవిడ్ ఖాతాలో మొత్తం 3 డీమెరిట్ పాయింట్స్ ఉన్నాయి. మరో డీమెరిట్ పాయింట్ చేరితే అతను ఒక మ్యాచ్ నిషేధం ఎదుర్కోనున్నాడు.
ఆదివారం రాయ్‌పూర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ 2 వికెట్ల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ నమోదు చేసింది. అయితే ఈ మ్యాచ్‌లో టీమ్ డేవిడ్ గోల్డెన్ డకౌటయ్యాడు. ఆర్‌సీబీ గెలిచిన వెంటనే డగౌట్ నుంచి మిడిల్ ఫింగర్ చూపిస్తూ సెలెబ్రేట్ చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కాగా.. ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ తీవ్రంగా పరిగణించింది. అతనిపై చర్యలు తీసుకున్నామనే విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.

'ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆర్టికల్ 2.6 ప్రకారం జట్టు లేదా వ్యక్తిని ఉద్దేశించి అసభ్యకరమైన సంజ్ఞ చేయడం రూల్స్‌కు విరుద్ధం. ఈ ఉల్లంఘన చర్య కింద టీమ్ డేవిడ్‌పై మ్యాచ్ రిఫరీ కఠిన చర్యలు తీసుకున్నారు. అతని మ్యాచ్ ఫీజులో 30 శాతం జరిమానా విధించడంతో పాటు.. 2 డీమెరిట్ పాయింట్లు కూడా కేటాయించారు' అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌తో ఏప్రిల్ 13న జరిగిన తొలి మ్యాచ్‌లోనూ అంపైర్‌కు బంతి ఇవ్వకుండా పైకి ఎగిరేస్తూ ఆడినందుకు టీమ్ డేవిడ్‌కు జరిమానా విధించారు. మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధించడంతో పాటు ఒక డీమెరిట్ పాయింట్ కేటాయించారు. ఈ సీజన్‌లో అతను మరో తప్పిదం చేసి డీమెరిట్ పాయింట్ అందుకుంటే ఓ మ్యాచ్ నిషేధం ఎదుర్కొంటాడు. ప్లే ఆఫ్స్ ముంగిట టీమ్ డేవిడ్ కాస్త జాగ్రత్తగా ఉండాలని ఆర్‌సీబీ ఫ్యాన్స్ కోరుతున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications