Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వాడు మరో సచిన్.. సెలెక్టర్లకు అనిల్ కుంబ్లే వార్నింగ్!

టీమిండియా టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీపై దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే ప్రశంసల జల్లు కురిపించాడు. వైభవ్ సూర్యవంశీ మరో సచిన్ టెండూల్కర్ తరహా ఆటగాడని కొనియాడాడు. ఈ 15 ఏళ్ల కుర్రాడిని టీమిండియాకు ఆడించే విషయంలో అత్యుత్సాహం ప్రదర్శించవద్దని సెలెక్టర్లను కుంబ్లే హెచ్చరించాడు.

ఐపీఎల్ 2026 సీజన్‌లో అసాధారణ ప్రదర్శన కనబరుస్తున్న వైభవ్ సూర్యవంశీపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. ఈ సీజన్‌ను హాఫ్ సెంచరీతో ప్రారంభించిన వైభవ్ సూర్యవంశీ.. గుజరాత్ టైటాన్స్‌పై 31, ముంబై ఇండియన్స్‌పై 39 పరుగులతో దూకుడుగా ఆడాడు. ముఖ్యంగా ముంబైతో జరిగిన గత మ్యాచ్‌లో జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో భారీ సిక్స్‌లు బాదాడు. తన విధ్వంసంతో మ్యాచ్‌ను ముంబై నుంచి లాగేసుకున్నాడు. వరల్డ్ బెస్ట్ పేసర్ బుమ్రాను చితక్కొట్టిన వైభవ్ సూర్యవంశీని.. టీమిండియాలోకి తీసుకోవాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది.

IPL 2026 The Next Sachin Anil Kumble Highlights Teenage Sensation Vaibhav Sooryavanshi s Potential

అయితే ఈ విషయంలో తొందరపడవద్దని, వైభవ్‌పై అనవసర ఒత్తిడిని తీసుకురావద్దని కుంబ్లే సెలెక్టర్లకు హెచ్చరించాడు. సెలెక్టర్లు, అభిమానుల అంచనాల కంటే.. సదరు ఆటగాడి సన్నద్ధతను బట్టి నిర్ణయం తీసుకోవాలని కుంబ్లే సూచించాడు. శుక్రవారం పీటీఐతో మాట్లాడిన కుంబ్లే.. ఈ వ్యాఖ్యలు చేశాడు.

'వైభవ్ సూర్యవంశీనే తన ప్రదర్శనతో టీమిండియా ఎంట్రీ ఎప్పుడా? అని వస్తున్న ప్రశ్నకు సమాధానం ఇస్తాడని నేను భావిస్తున్నా. కొన్నిసార్లు ఒక ఆటగాడిని జట్టు నుంచి పక్కన పెట్టడం చాలా కష్టంగా మారుతుంది. సచిన్ టెండూల్కర్ విషయంలోనూ అదే జరిగింది. 14, 15 ఏళ్ల వయస్సులో సచిన్ మైదానంలోకి అడుగుపెట్టిన ప్రతిసారీ సెంచరీలు సాధించేవాడు.

వైభవ్‌ను చూస్తుంటే అతను కూడా సచిన్ బాటలోనే వెళ్తున్నాడనిపిస్తోంది. అయితే ఇప్పుడే వైభవ్ సూర్యవంశీకి మరో రెండు నెలల్లో టీమిండియా తరఫున ఆడుతావని చెబితే ఆ కుర్రాడిపై అనవసరమైన ఒత్తిడి కలుగుతుంది. కానీ, అతను బ్యాటింగ్ చేస్తున్న తీరు చూస్తుంటే సెలెక్టర్లు అతన్ని నిశితంగా గమనిస్తారనడంలో సందేహం లేదు.'అని అనిల్ కుంబ్లే పేర్కొన్నారు.

Story first published: Friday, April 10, 2026, 19:56 [IST]
Other articles published on Apr 10, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+