Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2026: కాటేరమ్మ కొడుకుల ఊచకోత.. !

సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు మరోసారి దుమ్మురేపారు. ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)తో ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 256 పరుగుల భారీ లక్ష్యాన్ని నమోదు చేసింది.

కాటేరమ్మ కొడుకులు అభిషేక్ శర్మ(22 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 56), ఇషాన్ కిషన్(46 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లతో 79), హెన్రీచ్ క్లాసెన్(24 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్‌లతో 51) విధ్వంసకర హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 255 పరుగులు చేసింది. నితీష్ కుమార్ రెడ్డి(12 బంతుల్లో ఫోర్, 3 సిక్స్‌లతో 29 నాటౌట్), ట్రావిస్ హెడ్(16 బంతుల్లో 5 ఫోర్లతో 26) టాప్ స్కోరర్లుగా నిలిచారు.

IPL 2026 The Mammoth Equation SRH Must Defend Against RCB to Snatch Top-2 Playoff Spot After Posting 255 4

ఆరెంజ్ ఆర్మీ బ్యాటర్ల ధాటికి ఆర్‌సీబీ బౌలర్లు ధారళంగా పరుగులిచ్చుకున్నారు. భువనేశ్వర్ కుమార్(0/51)తో పాటు జోష్ హేజిల్ వుడ్(0/55), రసీక్ సలామ్(2/55) హాఫ్ సెంచరీలు నమోదు చేశారు. సుయాష్ శర్మ(1/36), కృనాల్ పాండ్యా(1/24) చెరో వికెట్ తీసారు. ఆర్‌సీబీపై సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఇది రెండో అత్యధిక స్కోర్. ఐపీఎల్ 2024 సీజన్‌లో బెంగళూరు వేదికగా ఆర్‌సీబీ 287/3 స్కోర్ చేసింది.

వైభవ్ సూర్యవంశీ ఎఫెక్ట్.. ఐపీఎల్‌లో మరో కొత్త టీమ్!

వైభవ్ సూర్యవంశీ ఎఫెక్ట్.. ఐపీఎల్‌లో మరో కొత్త టీమ్!

ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీని సన్‌రైజర్స్ హైదరాబాద్ 165 పరుగుల్లోపు కట్టడి చేయాలి. 90+ పరుగుల తేడాతో విజయం సాధించాలి. అప్పుడే మెరుగైన రన్‌రేట్‌తో గుజరాత్ టైటాన్స్‌ను వెనక్కి నెట్టి పాయింట్స్ టేబుల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ టాప్-2లో నిలుస్తోంది. తద్వారా క్వాలిఫయర్-1కు అర్హత సాధిస్తోంది. ఆర్‌సీబీ తమ టాప్-2 ప్లేస్‌ను పదిలంగా ఉంచుకోవాలంటే కనీసం 165 పరుగులు చేయాలి.

ఐపీఎల్‌కు 3D ప్లేయర్ శంకరన్న గుడ్‌బై!

ఐపీఎల్‌కు 3D ప్లేయర్ శంకరన్న గుడ్‌బై!
Story first published: Friday, May 22, 2026, 21:50 [IST]
Other articles published on May 22, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+