Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2026: తమిళనాడు సీఎంగా విజయ్.. టైటిల్ సీఎస్కేదేనా..?

తమిళనాడు ముఖ్యమంత్రిగా టీవీకే అధినేత, దళపతి విజయ్ ప్రమాణ స్వీకారం చేసారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సంచలన విజయం నమోదు చేసిన విజయ్.. అనేక ట్విస్టుల అనంతం ఎట్టకేలకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆదివారం చెన్నైలోని నెహ్రా స్టేడియంలో సరిగ్గా 10.17 గంటలకు జోసెఫ్ విజయ్ అనే నేను అంటూ సీఎంగా ప్రమాణం చేశారు.

అయితే తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు ఓ సెంటిమెంట్‌ను తెరపైకి తీసుకొచ్చారు. తమిళనాడులో ప్రభుత్వాలు మారిన ప్రతీసారి చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ ట్రోఫీ అందుకుందని గుర్తు చేస్తూ పోస్ట్‌లు పెడుతున్నారు.

IPL 2026 Thalapathy Vijay Sworn In as Tamil Nadu CM Fans Recall CSK s Luck With Govt Changes

2011లో ప్రభుత్వం మారి జయలలిత సీఎం అయ్యారు. ఆ ఏడాది సీఎస్‌కే టైటిల్ అందుకుంది. 2021లోనూ ఇదే జరిగింది. స్టాలిన్ సీఎం అయిన ఆ ఏడాది చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ అందుకుంది. ఈ ఏడాది సర్కారు మారి విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. దాంతో ఈ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ విజేతగా నిలుస్తుందా? అని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. సెంటిమెంట్ రిపీట్ అయితే టైటిల్ చెన్నైదేనని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఐపీఎల్‌లో సెంటిమెంట్స్‌కు తావులేదు. అన్‌ప్రెడిక్ట్ ఐపీఎల్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం కష్టం. సీఎస్‌కే టైటిల్ గెలుస్తుందని, గెలవదని చెప్పడానికి ఆస్కారం లేదు. ప్రస్తుతం సీఎస్‌కే క్లిష్టపరిస్థితులను ఎదుర్కొంటుంది. 10 మ్యాచ్‌ల్లో ఐదు గెలిచిన ఐదు ఓడిన సీఎస్‌కే.. పాయింట్స్ టేబుల్‌లో 6వ స్థానంలో కొనసాగుతోంది. ఆ జట్టు ప్లే ఆఫ్స్ చేరాలంటే చివరి 4 మ్యాచ్‌ల్లో మూడు గెలవాలి.

ఈ రోజు లక్నో సూపర్ జెయింట్స్‌తో చెపాక్ వేదికగా జరిగే మ్యాచ్‌ చెన్నై సూపర్ కింగ్స్‌కు కీలకం. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే సీఎస్‌కే ఆత్మవిశ్వాసం రెట్టింపు కావడంతో పాటు ప్లే ఆఫ్స్ అవకాశాలు ఈజీగా మారుతాయి.

Story first published: Sunday, May 10, 2026, 15:17 [IST]
Other articles published on May 10, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+