IPL 2026: సూర్య చెత్త నిర్ణయమే ఓటమికి కారణం.. లాస్ట్ ఓవర్ అతనికి ఇచ్చి ఉంటే ముంబైదే విజయం!
ఐపీఎల్ 2026 సీజన్‌లో ముంబై ఇండియన్స్ పోరాటం ముగిసింది. ఆదివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)తో ఉత్కంఠగా సాగిన పోరులో ముంబై ఇండియన్స్ 2 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ పరాజయంతో ప్లే ఆఫ్స్ రేసు నుంచి ముంబై ఇండియన్స్ అధికారికంగా తప్పుకుంది. మరోవైపు ఆర్‌సీబీ 7వ విజయాన్ని ఖాతాలో వేసుకొని పాయింట్స్ టేబుల్‌లో అగ్రస్థానంలో నిలిచింది.
ఆర్‌సీబీతో సునాయసంగా గెలవాల్సిన మ్యాచ్‌ను ముంబై ఇండియన్స్ చేజేతులా చేజార్చుకుంది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తీసుకున్న చెత్త నిర్ణయం ముంబై ఇండియన్స్ ఓటమికి ప్రధాన కారణమైంది.
బుమ్రా మలుపు తిప్పినా..
167 పరుగుల లక్ష్య ఛేదనలో ఆర్‌సీబీ 18 ఓవర్ల తర్వాత 7 వికెట్లకు 149 పరుగులు చేసింది. చివరి 12 బంతుల్లో ఆర్‌సీబీ విజయానికి 18 పరుగులు అవసరమయ్యాయి. క్రీజులో రొమారియో షెపర్డ్, రసిక్ సలామ్‌లు ఉన్నారు. 19వ ఓవర్ వేసిన బుమ్రా.. కేవలం మూడు పరుగులు మాత్రమే ఇచ్చి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు.
బుమ్రా స్టన్నింగ్ బౌలింగ్‌తో ఆర్‌సీబీ విజయ సమీకరణం 6 బంతుల్లో 15 పరుగులుగా మారింది. దాంతో ముంబై ఇండియన్స్ విజయం లాంఛనమేనని అంతా అనుకున్నారు. కానీ ఇక్కడే సూర్యకుమార్ యాదవ్ ఘోర తప్పిదం చేశాడు. ఆఖరి ఓవర్‌ను అనుభవం లేని రాజ్ బవతో వేయించి మూల్యం చెల్లించుకున్నాడు.

రాజ్ బవ చెత్త బౌలింగ్..
ఒత్తిడిని తట్టుకోలేకపోయిన రాజ్‌బవ.. మూడు వైడ్స్, నోబాల్ వేసి పుణ్యానికి నాలుగు పరుగులు ఇచ్చుకున్నాడు. మూడో బంతికి రొమారియో షెపర్డ్‌ను ఔట్ చేశాడు. దాంతో చివరి మూడు బంతుల్లో ఆర్‌సీబీ విజయానికి 10 పరుగులు అవసరమయ్యాయి.
క్రీజులోకి వచ్చిన భువనేశ్వర్ కుమార్ ఎదుర్కొన్న తొలిబంతినే సిక్సర్ తరలించాడు. దాంతో మరింత ఒత్తిడికి గురైన రాజ్ బవ.. ఆఖరి బంతికి రనౌట్ చేసే అవకాశాన్ని కూడా చేజార్చాడు. మొత్తానికి అనసవర ఓత్తిడితో ముంబై ఓటమికి కారణమయ్యాడు.
అల్లా ఘజన్‌ఫర్‌తో వేయించి ఉంటే..
అయితే ఆఖరి ఓవర్ రాజ్ బవకు బదులు అల్లా ఘజన్‌ఫర్‌కు ఇచ్చి ఉంటే ముంబై విజయం సాధించేదని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముంబై ప్రధాన స్పిన్నర్ అయిన అల్లా ఘజన్‌ఫర్ ఆఖరి ఓవర్ వేసి ఉంటే ఆర్‌సీబీ బ్యాటర్లు దూకుడుగా ఆడే ప్రయత్నంలో ఔటయ్యేవారని చెబుతున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications