తండ్రైన సూర్యకుమార్ యాదవ్
టీమిండియా టీ20 కెప్టెన్, ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ తండ్రయ్యాడు. అతని సతీమణి దేవిశా శెట్టి గురువారం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని సూర్యకుమార్ యాదవ్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. 'బోసి నవ్వులు, ఎన్నో కలలతో.. మా ఇంటి మహాలక్ష్మికి స్వాగతం.'అని ఎక్స్ వేదికగా ఓ పోస్ట్‌ను షేర్ చేశాడు. తన బుజ్జి పాపాయి చేతి వేలిని పట్టుకున్న ఫొటోను ఈ పోస్ట్‌లో పంచుకున్నాడు.
దేవిశాతో సూర్యకుమార్ యాదవ్‌కు 2016లో వివాహమైంది. సూర్యకుమార్ యాదవ్- దేవిషా శెట్టిలది సినిమాటిక్ కాలేజ్ లవ్‌స్టోరీ. ఈ ఇద్దరికి ఓ మ్యూచవల్ ఫ్రెండ్ ద్వారా అయిన పరిచయం ప్రేమగా మారింది. అనంతరం ఇరుకుటుంబాలను ఒప్పించి వివాహబంధంతో ఒక్కటయ్యారు. పెళ్లై 10 ఏళ్ల తర్వాత ఈ దంపతులు తల్లిదండ్రులయ్యారు.
ఈ ఏడాది కెప్టెన్‌గా టీమిండియాకు టీ20 వరల్డ్ కప్ అందించడం, ఇప్పుడు కూతురు జన్మించడంతో సూర్యకుమార్ యాదవ్ కుటుంబంలో డబుల్ హ్యాపీనెస్ వచ్చినట్లయింది. తండ్రి కావడంతో సూర్యకుమార్ యాదవ్ తన కుటుంబంతో గడిపేందుకు ఐపీఎల్ నుంచి బ్రేక్ తీసుకున్నట్లు తెలుస్తోంది.

మే 10న రాయ్‌పుర్‌లో ఆర్‌సీబీతో జరిగే మ్యాచ్‌లో ఆడటం లేదని సమాచారం. ఈ ఐపీఎల్ 2026 సీజన్‌లో 10 మ్యాచ్‌లు ఆడిన సూర్యకుమార్ యాదవ్.. 195 పరుగులే చేశాడు. పేలవ ప్రదర్శనతో ఇబ్బంది పడుతున్నాడు. మరోవైపు ముంబై ఇండియన్స్ కూడా పేలవ ప్రదర్శనతో ప్లే ఆఫ్స్ రేసు నుంచి దాదాపు తప్పుకుంది. అద్భుతం జరిగితే తప్పా ముంబై ఇండియన్స్ టోర్నీలో ముందుడుగు వేయలేని పరిస్థితి నెలకొంది.
ముంబై ఇండియన్స్‌కు సూర్యకుమార్ యాదవ్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. అనారోగ్యంతో గత మ్యాచ్‌కు హార్దిక్ పాండ్యా దూరం కాగా.. సూర్యకుమార్ యాదవ్ ముంబై ఇండియన్స్ జట్టును నడిపించాడు. ఆ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ విజయం సాధించడంతో సూర్యనే కెప్టెన్‌గా కొనసాగిస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications