చరిత్ర సృష్టించిన SRH.. ఐపీఎల్ చరిత్రలోనే ఏ జట్టుకు సాధ్యం కాని రికార్డ్!
సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) చరిత్ర సృష్టించింది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక సార్లు పవర్ ప్లేలో 100+ స్కోర్లు నమోదు చేసిన ఏకైక జట్టుగా నిలిచింది. 19 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో సన్‌రైజర్స్ హైదరాబాద్ మూడు సార్లు పవర్ ప్లేలోనే 100 ప్లస్ స్కోర్లు నమోదు చేసింది. మరే జట్టు కూడా ఈ ఫీట్ అందుకోలేదు.
ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో ముల్లాన్‌పూర్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ ఫీట్ సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. అభిషేక్ శర్మ(28 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్స్‌లతో 74), ట్రావిస్ హెడ్(23 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 38) విధ్వంసకర బ్యాటింగ్‌తో పవర్ ప్లేలో వికెట్ నష్టపోకుండా 105 పరుగులు చేసింది.

ఐపీఎల్‌లో అత్యధిక పవర్ ప్లే స్కోర్ రికార్డు కూడా సన్‌రైజర్స్ హైదరాబాద్ పేరిటనే ఉంది. ఐపీఎల్ 2024 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ వికెట్ నష్టపోకుండా 125 పరుగులు చేసింది. ఐపీఎల్ చరిత్రలో ఇదే హయ్యెస్ట్ పవర్ ప్లే స్కోర్‌గా ఉంది. అదే ఏడాది లక్నోపై 107/0 పరుగులు చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. తాజాగా ముల్లాన్‌పూర్‌లో పంజాబ్‌పై 105/0 స్కోర్ నమోదు చేసి అత్యధిక పవర్ ప్లే స్కోర్ల జాబితాలో వరుసగా టాప్-3లో నిలిచింది.
సన్‌రైజర్స్ హైదరాబాద్ తర్వాత కేకేఆర్ 105/0 స్కోర్‌తో నాలుగో స్థానంలో ఉంది. 2017లో ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ ఈ ఫీట్ సాధించింది. చెన్నై సూపర్ కింగ్స్ 2014లో ముంబైపై సీఎస్‌కే పవర్ ప్లేలో 100/2 స్కోర్ చేసింది.
ఐపీఎల్ చరిత్రలో పవర్‌ప్లే (1-6 ఓవర్లు)లో నమోదైన అత్యధిక స్కోర్లు (100+)
125/0 - SRH vs DC, ఢిల్లీ, 2024
107/0 - SRH vs LSG, హైదరాబాద్, 2024
105/0 - SRH vs PBKS, ముల్లన్‌పూర్, 2026
105/0 - KKR vs RCB, బెంగళూరు, 2017
100/2 - CSK vs PBKS, ముంబై WS, 2014
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications