Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SRH vs RR: బుడ్డోడి చేతుల్లో మనోళ్లకు బడిత పూజే!

ఐపీఎల్ 2026 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మరో ఆసక్తికర పోరుకు సిద్దమైంది. తమ హోమ్ గ్రౌండ్‌ ఉప్పల్ స్టేడియం వేదికగా సోమవారం జరిగే మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ అమీతుమీ తేల్చుకోనుంది. వరుస పరాజయాలతో చతికిలపడిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఈ మ్యాచ్ గెలిచి మళ్లీ విజయాల బాట పట్టాలనుకుంటుంది.

మరోవైపు వరుసగా 4 మ్యాచ్‌లు గెలిచి జోరు మీదున్న రాజస్థాన్ రాయల్స్ అదే జోరును కొనసాగించాలనే పట్టుదలతో ఉంది. ఈ మ్యాచ్‌ నేపథ్యంలో అందరి కళ్లు రాజస్థాన్ రాయల్స్ టీనేజ్ సెన్సేషన్, 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ‌పైనే ఉన్నాయి. ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లను ఓ ఆట ఆడుకున్న ఈ బుడ్డోడు.. బలహీనంగా ఉన్న సన్‌రైజర్స్ బౌలర్లపై ఎలా చెలరేగుతాడో అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.

IPL 2026 Sunrisers Hyderabad Bowlers Face Acid Test Against RR s Teenage Sensation Vaibhav Sooryavanshi

భువీ, బుమ్రానే చితక్కొట్టాడు..

అంతేకాకుండా ఉప్పల్ స్టేడియంలోని పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. పైగా ఈ మ్యాచ్ రాత్రి వేళలో జరగనున్న నేపథ్యంలో పిచ్ ఫ్లాట్‌గా ఉండి బంతి బ్యాట్‌పైకి ముద్దుగా వచ్చే ఛాన్స్ ఉంది. అదే జరిగితే వైభవ్ సూర్యవంశీని అడ్డుకోవడం ఆరెంజ్ ఆర్మీకి కత్తి మీద సామే అవుతుంది.

కగిసో రబాడ, జస్‌ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, జోష్ హాజెల్ వుడ్ వంటి వరల్డ్ క్లాస్ బౌలర్లను వైభవ్ సూర్యవంశీ చితక్కొట్టాడు. స్టార్ ప్లేయర్లను ఆడుతున్నాననే భయం లేకుండా వారిపై విరుచుకుపడ్డాడు. బుమ్రా బౌలింగ్‌లో అయితే తొలి మూడు బంతుల్లో 2 సిక్స్‌లు బాది అందర్నీ ఆశ్చర్యపరిచాడు ఈ వండర్ కిడ్. భువీ, హాజెల్ వుడ్ బౌలింగ్‌లో ఎదుర్కొన్న తొలి బంతినే బౌండరీకి తరలించాడు. విధ్వంసకరం బ్యాటింగ్‌‌తో పవర్ ప్లేలోనే మ్యాచ్‌లను లాగేసుకుంటున్నాడు.

ఆరెంజ్ ఆర్మీకి బడిత పూజే

బౌలింగ్ పటిష్టంగా ఉన్న ఆర్‌సీబీ, ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్‌ జట్లనే చితక్కొట్టిన బుడ్డోడు.. ఎక్స్‌ఫ్యాక్టర్ బౌలర్ లేని సన్‌రైజర్స్‌‌ను ఓ ఆట ఆడుకుంటాడని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. ఆరెంజ్ ఆర్మీ బౌలర్లకు బడిత పూజేనని హెచ్చరిస్తున్నారు.

వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో 52, 31, 39, 78 పరుగులతో 200 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా వైభవ్ సూర్యవంశీ కొనసాగుతున్నాడు. 266.66 స్ట్రైక్‌రేట్‌, 50 సగటుతో వైభవ్ పరుగులు చేయడం గమనార్హం. ఆరెంజ్ క్యాప్ బ్యాటర్ల లిస్ట్‌లో వైభవ్ సూర్యవంశీలా మరే బ్యాటర్ స్ట్రైక్‌రేట్ లేకపోవడం గమనార్హం.

Story first published: Sunday, April 12, 2026, 12:26 [IST]
Other articles published on Apr 12, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+