IPL 2026: SRH ఘన విజయం.. కానీ ఆర్‌సీబీదే టాప్ ప్లేస్!
ఐపీఎల్ 2026 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) భారీ విజయంతో లీగ్ దశను ముగించినా క్వాలిఫయర్-1కు అర్హత సాధించలేకపోయింది. శుక్రవారం ఉప్పల్ మైదానం వేదికగా జరిగిన హైస్కోరింగ్ గేమ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 55 పరుగుల భారీ తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)ని ఓడించింది. ఈ గెలుపుతో 9 విజయాలతో 18 పాయింట్లు సాధించినా పాయింట్స్ టేబుల్‌లో SRH టాప్-2 బెర్త్‌ను దక్కించుకోలేకపోయింది. పేలవ రన్‌రేట్ కారణంగా మూడో స్థానానికే పరిమితమైంది.
దాంతో టేబుల్ టాపర్ ఆర్‌సీబీ, రన్నరప్ గుజరాత్ టైటాన్స్‌లు క్వాలిఫయర్-1కు అర్హత సాధించాయి. 90 పరుగుల తేడాతో ఆర్‌సీబీని ఓడించి ఉంటే సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు టాప్-2 ప్లేస్ దక్కేది. కానీ 35 పరుగుల దూరంలో ఈ బెర్త్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ చేజార్చుకుంది.

SRH బ్యాటర్ల ఊచకోత..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 255 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ(22 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 56), ఇషాన్ కిషన్(46 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లతో 79), హెన్రీచ్ క్లాసెన్(24 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్‌లతో 51) విధ్వంసకర హాఫ్ సెంచరీలతో చెలరేగారు.
నితీష్ కుమార్ రెడ్డి(12 బంతుల్లో ఫోర్, 3 సిక్స్‌లతో 29 నాటౌట్), ట్రావిస్ హెడ్(16 బంతుల్లో 5 ఫోర్లతో 26) దూకుడుగా ఆడారు. ఆర్‌సీబీ బౌలరలో రసీక్ సలామ్(2/55) రెండు వికెట్లు తీయగా.. సుయాష్ శర్మ(1/36), కృనాల్ పాండ్యా(1/24) చెరో వికెట్ పడగొట్టారు. ఆర్‌సీబీ ప్రధాన పేసర్లు భువనేశ్వర్ కుమార్(0/51), జోష్ హేజిల్ వుడ్(0/55) ధారళంగా పరుగులు సమర్పించుకున్నారు.
అనంతరం ఆర్‌సీబీ 20 ఓవర్లలో 4 వికెట్లకు 200 పరుగులే చేసి ఓటమిపాలైంది. కెప్టెన్ రజత్ పాటిదార్(39 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 56) హాఫ్ సెంచరీతో రాణించగా.. వెకంటేశ్ అయ్యర్(19 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 44), కృనాల్ పాండ్యా(31 బంతుల్లో 5 ఫోర్లతో 41 నాటౌట్) పర్వాలేదనిపించారు. విరాట్ కోహ్లీ(15), దేవదత్ పడిక్కల్(21) నిరాశపర్చారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో ఇషాన్ మలింగా(2/33) రెండు వికెట్లు తీయగా.. సాకిబ్ హుస్సేన్, ట్రావిస్ హెడ్‌లకు తలో వికెట్ దక్కింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications