Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2026: చరిత్ర సృష్టించిన సన్‌రైజర్స్ హైదరాబాద్!

సన్‌రైజర్స్ హైదరాబాద్ చరిత్ర సృష్టించింది. తమ దూకుడైన బ్యాటింగ్‌తో అత్యధిక పవర్ ప్లే స్కోర్‌ను నమోదు చేసింది. ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో కోల్‌కతా వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆరెంజ్ ఆర్మీ.. పవర్ ప్లేలో వికెట్ నష్టానికి 84 పరుగులు చేసింది. ఈ సీజన్‌లో ఇదే అత్యధిక పవర్ ప్లే స్కోర్. ఇప్పటి వరకు జరిగిన 6 మ్యాచ్‌ల్లో ముంబై ఇండియన్స్ మాత్రమే పవర్ ప్లేలో 80/0 స్కోర్ చేసింది.

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ దూకుడుగా ఆడటంతో వేగంగా పరుగులు వచ్చాయి. తొలి ఓవర్‌లో ఆచితూచి ఆడిన ఈ ఇద్దరూ ముజర్బానీ వేసిన రెండో ఓవర్ నుంచి హిట్టింగ్ ప్రారంభించారు. ఈ ఓవర్‌లో 16 పరుగులు రాగా.. వైభవ్ అరోరా వేసిన మూడో ఓవర్‌లో 21 పరుగులు వచ్చాయి. సునీల్ నరైన్ కట్టడిగా వేసి మూడు పరుగులే ఇచ్చాడు.

ఈ ఓవర్‌లో ట్రావిస్ హెడ్ ఇచ్చిన క్యాచ్‌ను రహానే నేలపాలు చేశాడు. వరుణ్ చక్రవర్తీ వేసిన ఐదో ఓవర్‌లో అభిషేక్ 2 సిక్స్‌లతో పాటు మూడు బౌండరీలు బాది 25 పరుగులు పిండుకున్నాడు. కార్తీక్ త్యాగీ వేసిన ఆరో ఓవర్‌లో హెడ్.. 4, 6 బాది క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. దాంతో పవర్ ప్లేలో సన్‌రైజర్స్ 84/1 స్కోర్ చేసింది.

ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పవర్ ప్లే స్కోర్ రికార్డ్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌పైనే ఉంది. 2024లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై సన్‌రైజర్స్ పవర్ ప్లేలో 125/0 స్కోర్ చేసింది. ఇప్పటి వరకు ఈ రికార్డ్ చెక్కుచెదరకుండా ఉంది.

IPL 2026 SRH Smash Highest Powerplay Score of the Season Against KKR at Eden Gardens

ఐపీఎల్ చరిత్రలో SRH సాధించిన అత్యధిక పవర్‌ప్లే స్కోర్లు..

125/0 - ఢిల్లీ క్యాపిటల్స్ (DC) పై, ఢిల్లీ, 2024

107/0 - లక్నో సూపర్ జెయింట్స్ (LSG) పై, హైదరాబాద్, 2024

94/1 - రాజస్థాన్ రాయల్స్ (RR) పై, హైదరాబాద్, 2025

84/2 - పంజాబ్ కింగ్స్ (PBKS) పై, హైదరాబాద్, 2024

84/1 - కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) పై, కోల్‌కతా, 2026*

ఐపీఎల్‌లో టాప్-5 అత్యధిక పవర్ ప్లే స్కోర్లు

సన్‌రైజర్స్ హైదరాబాద్ 125/0 vs ఢిల్లీ క్యాపిటల్స్ ,ఢిల్లీ 2024
సన్‌రైజర్స్ హైదరాబాద్ 107/0 vs లక్నో సూపర్ జెయింట్స్ హైదరాబాద్ 2024
కోల్‌కతా నైట్ రైడర్స్ 105/0 vs ఆర్సీబీ బెంగళూరు 2017
చెన్నై సూపర్ కింగ్స్ 100/2 vsపంజాబ్ కింగ్స్ ముంబై 2014
సన్‌రైజర్స్ హైదరాబాద్ 94/1 vs రాజస్థాన్ రాయల్స్ హైదరాబాద్ 2025

Story first published: Thursday, April 2, 2026, 20:44 [IST]
Other articles published on Apr 2, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+