Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2026: గుజరాత్ చేతిలో ఘోర పరాజయం.. SRH ప్లే ఆఫ్స్ చేరాలంటే..?

ఐపీఎల్ 2026 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు అనూహ్య పరాజయం ఎదురైంది. మంగళవారం అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన గుజరాత్ టైటాన్స్ 83 పరుగుల భారీ తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను చిత్తు చేసింది.

ఈ ఘోర పరాజయంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ నెట్ రన్‌రేట్(0.331) దారుణంగా పడిపోయింది. ఈ ఓటమితో పాయింట్స్ టేబుల్‌లో తమ స్థానం ఏం మారకపోయినా.. ప్లే ఆఫ్స్ అవకాశాలను ఆరెంజ్ ఆర్మీ సంక్లిష్టంగా మార్చుకుంది. 12 మ్యాచ్‌ల్లో 7 విజయాలతో మూడో స్థానంలో కొనసాగుతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్.. ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కించుకోవాలంటే చివరి 2 మ్యాచ్‌లకు రెండు గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

1. రెండు మ్యాచ్‌లకు రెండు గెలవాలి..

సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు మరో రెండు లీగ్ మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా ప్లేఆఫ్స్ బెర్తును ఖరారు చేసుకోవాలంటే ఆరెంజ్ ఆర్మీ ఈ రెండు మ్యాచ్‌లకు రెండు గెలవాలి. అప్పుడు 14 మ్యాచ్‌ల్లో 9 విజయాలు 18 పాయింట్లతో ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కుతుంది. రన్‌రేట్ మెరుగ్గా ఉండి ఇతర జట్ల ఫలితాలు కలిసి వస్తే టాప్-2లో కూడా నిలుస్తోంది.

IPL 2026 SRH Playoff Scenarios How Sunrisers Hyderabad Can Qualify Despite Heavy Defeat to Gujarat Titans

2. ఒక్క మ్యాచ్ ఓడితే..

తమ చివరి రెండు మ్యాచ్‌ల్లో ఒక్కటి ఓడినా.. ఇతర జట్ల ఫలితాలు, నెట్‌రన్‌ రేట్‌పై ఆధారపడాల్సి ఉంటుంది. ఎందుకంటే సన్‌రైజర్స్ ఒకటి గెలిచి మరొకటి ఓడితే 14 మ్యాచ్‌ల్లో 8 విజయాలతో 16 పాయింట్లతో నిలుస్తుంది. ఇతర జట్లు కూడా 16 పాయింట్స్ సాధిస్తే నెట్‌రనేట్ కీలకం అవుతుంది. ప్రస్తుతం సన్‌రైజర్స్ నెట్‌రన్‌రేట్ భారీగా తగ్గింది. తదుపరి మ్యాచ్‌ల్లో రన్‌రేట్ మెరుగపర్చుకుంటే ఒక మ్యాచ్ ఓడినా ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కుతుంది.

3. రెండు మ్యాచ్‌లకు 2 ఓడితే..

తమ చివరి రెండు మ్యాచ్‌లకు రెండు ఓడిపోతే సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్స్ అవకాశాలు దాదాపు గల్లంతవుతాయి. ఎందుకంటే SRH రెండు మ్యాచ్‌లు ఓడితే 14 మ్యాచ్‌ల్లో 7 విజయాలు, 14 పాయింట్లతో నిలుస్తుంది. అదృష్టం కలిసొచ్చి నాలుగో స్థానం కోసం పోటీ పడే జట్లు కూడా 14 పాయింట్లతో నిలిచి.. సన్‌రైజర్స్ రన్‌రేట్ మెరుగ్గా ఉంటే టోర్నీలో ముందడుగు వేస్తోంది. ఇలా జరగడం చాలా కష్టం. అద్భుతం జరిగితే తప్పా ఇలాంటి పరిస్థితి ఉండదు.

SRH తదుపరి షెడ్యూల్..

మే 18న చెన్నై సూపర్ కింగ్స్‌తో చెపాక్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్ తదుపరి మ్యాచ్ ఆడనుంది. మే 22న హోమ్ గ్రౌండ్ ఉప్పల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. చెపాక్ స్టేడియంలోని పిచ్ కూడా స్లోగా ఉంటుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే సన్‌రైజర్స్ ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. ఓడితే మాత్రం మరింత ఒత్తిడి నెలకొంటుంది.

Story first published: Wednesday, May 13, 2026, 7:10 [IST]
Other articles published on May 13, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+