Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2026: సీఎస్‌కేకు కలిసి రానున్న కావ్యమారన్ తప్పిదం!

ఐపీఎల్ 2026 సీజన్‌కు సంబంధించిన మినీ వేలం డిసెంబర్ రెండవ వారంలో జరగనుంది. ఇప్పటికైతే మినీ వేలానికి సంబంధించిన వివరాలను బీసీసీఐ అధికారికంగా ప్రకటించలేదు. కానీ పలు నివేదికల ప్రకారం నవంబర్ చివరి వారంలోపు 10 ఫ్రాంచైజీలు తమ రిటెన్షన్, రిలీజ్ ప్లేయర్ల జాబితాలను ప్రకటించాల్సి ఉంటుందని తెలుస్తోంది.

ఈ క్రమంలోనే ఫ్రాంచైజీలు అంటిపెట్టుకునే, వదిలేసే ఆటగాళ్లపై ఫోకస్ పెట్టాయి. గత మెగా వేలంలో అత్యధిక ధర పలికి, స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లను ఫ్రాంచైజీలు వదిలేయనుకుంటున్నాయి. తద్వారా భారీ సొమ్ముతో వేలంలోకి వెళ్లవచ్చని భావిస్తున్నాయి.

IPL 2026 SRH Owner Kavya Maran Likely to Release Heinrich Klaasen Giving CSK a Big Opportunity

క్లాసెన్‌కు సన్‌రైజర్స్ గుడ్‌బై..

ఈ క్రమంలోనే సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ స్టార్ ప్లేయర్ హెన్రీచ్ క్లాసెన్‌ను వదులుకునేందుకు సిద్దమైందని టైమ్స్ ఆఫ్ ఇండియా ఒక కథనాన్ని ప్రచురించింది. గత సీజన్‌ వేలానికి ముందు ఆరెంజ్ ఆర్మీ.. క్లాసెన్‌ను రూ. 23 కోట్ల భారీ ధరకు రిటైన్ చేసుకుంది. క్లాసెన్ కూడా ఈ ధరకు న్యాయం చేశాడు. 13 మ్యాచ్‌ల్లో 487 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీతో పాటు హాఫ్ సెంచరీ ఉంది.

ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్‌కు క్లాసెన్ వీడ్కోలు పలికాడు. కేవలం ఫ్రాంచైజీ క్రికెట్ మాత్రమే ఆడుతున్నాడు. ఐపీఎల్ తర్వాత జరిగిన పలు ఫ్రాంచైజీ టోర్నీల్లో క్లాసెన్ నిరాశపర్చాడు. ఈ క్రమంలోనే అతన్ని వేలంలోకి వదిలేసి, తక్కువ ధరకు తిరిగి కొనుగోలు చేయాలని కావ్యమారన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

సీఎస్‌కేకు పండుగే..

అయితే ఇది సరైన నిర్ణయం కాదని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. క్లాసెన్‌ను వదిలేస్తే సీఎస్‌కే వేలంలో అతన్ని వదిలిపెట్టదని చెబుతున్నారు. హెన్రీచ్ క్లాసెన్ వంటి ఆటగాళ్లు సీఎస్‌కేకు అవసరమని, అతను గనుక ఆ జట్టులోకి వెళ్తే బ్యాటింగ్ విభాగం ప్రమాదకరంగా మారుతుందని అంచనా వేస్తున్నారు. క్లాసెన్ కోసం సీఎస్‌కే ఎంత ఖర్చు అయినా చేస్తుందని హెచ్చరిస్తున్నారు.

Story first published: Wednesday, November 5, 2025, 17:35 [IST]
Other articles published on Nov 5, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+