అతనే నా ఫేవరేట్ తెలుగు హీరో: ప్యాట్ కమిన్స్
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన ఫేవరేట్ తెలుగు క్రికెటర్ అని సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తెలిపాడు. తాను చాలా తక్కువగా సినిమాలు చూస్తానని, సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆడే సమయంలో తెలుగు సినిమాల గురించి సహచర ఆటగాళ్లతో చర్చిస్తానని చెప్పుకొచ్చాడు.
ప్రస్తుతం ఐపీఎల్ 2026 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌గా ప్యాట్ కమిన్స్ సత్తా చాటుతున్నాడు. వెన్ను గాయంతో ఫస్టాఫ్ సీజన్ మ్యాచ్‌లకు దూరమైన కమిన్స్.. సెకండాఫ్ సీజన్ మ్యాచ్‌లకు అందుబాటులోకి వచ్చాడు. ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ అద్వితీయమైన ప్రదర్శనతో ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. రెండో టైటిల్ గెలవడంపై కన్నేసింది.
మహేష్ బాబుతో భేటీ..
ఐపీఎల్ ప్రమోషన్స్ కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు ప్యాట్ కమిన్స్ తెలుగు సినిమాలు, హీరోల గురించి మాట్లాడాడు. సినిమాల డైలాగ్స్ కూడా చెప్పాడు. సూపర్ స్టార్ మహేష్ బాబును కూడా ప్రత్యేకంగా కలుసుకున్న కమిన్స్.. అందుకు సంబంధించి ఫొటోను సోషల్ మీడియా వేదికగా పంచుకొని తన అభిమానాన్ని చాటుకున్నాడు.

ఐపీఎల్ యాడ్ షూటింగ్స్ సమయంలో మహేష్ బాబుతో కమిన్స్ భేటి అయ్యాడు. ఆ సమయంలో మహేష్ బాబుతో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. 'ప్రిన్స్ ఆఫ్ టాలీవుడ్‌తో మధ్యాహ్న సమయాన్ని సరదాగా గడిపాను'అని క్యాప్షన్ ఇచ్చాడు. మహేష్ బాబు కూడా తాను కమిన్స్‌కు పెద్ద అభిమానినని బదులిచ్చాడు.
తెలుగు సినిమా డైలాగ్స్‌తో..
స్టార్ స్పోర్ట్స్ తెలుగు, SRH ప్రమోషనల్ వీడియోల్లో ప్యాట్ కమిన్స్ టాలీవుడ్ టాప్ హీరోల ఐకానిక్ డైలాగ్స్ చెప్పి తెలుగు అభిమానులను ఫిదా చేశాడు. 'ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను' అనే మహేష్ బాబు (పోకిరి) డైలాగ్‌ను కమిన్స్ ఎంతో స్టైలిష్‌గా చెప్పాడు.
అల్లు అర్జున్ పుష్ప సినిమాలోని 'పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫైరూ'అంటూ పుష్ప మేనరిజం చేసి చూపించాడు. పవన్ కళ్యాణ్ సిగ్నేచర్ మేనరిజం (గడ్డం కింద చేయి తిప్పడం) కూడా చేసి నెటిజన్లను ఆకట్టుకున్నాడు.
రాజస్థాన్ రాయల్స్‌తో..
బుధవారం న్యూఛండీఘర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగే ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి క్వాలిఫయర్-2కు అర్హత సాధించాలనే పట్టుదలతో ఉంది. పాయింట్స్ టేబుల్‌లో టాప్-2లో నిలిచిన ఆర్‌సీబీ, గుజరాత్ టైటాన్స్‌తో సమంగా 18 పాయింట్స్ సాధించినా.. పేలవ రన్‌రేట్ కారణంగా సన్‌రైజర్స్ మూడో స్థానానికి పరిమితమైంది.
అయితే 2016లో సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) తొలిసారి టైటిల్ గెలిచినప్పుడు కూడా మూడో స్థానంలోనే నిలిచింది. అప్పుడు ఫైనల్లో ఆర్‌సీబీని ఓడించి టైటిల్ గెలిచింది. తాజా సీజన్‌లో కూడా ఆర్‌సీబీనే ఫైనల్ చేరడంతో సన్‌రైజర్స్ టైటిల్ లోడింగ్ అంటూ ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications