SRH vs LSG: మా ముసలిదాని ముందు పరువు తీసారు కదరా!
ఐపీఎల్ 2026 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రయాణం పడుతూ లేస్తూ సాగుతోంది. డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)తో చిత్తుగా ఓడిన ఆరెంజ్ ఆర్మీ.. కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్)పై భారీ విజయం సాధించింది. కానీ సొంత మైదానంలో లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో ఓటమిపాలైంది. ఆదివారం ఉప్పల్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాపార్డర్ వైఫల్యంతో ఆరెంజ్ ఆర్మీ మూల్యం చెల్లించుకుంది.
భారీ అంచనాలతో మైదానానికి వెళ్లిన అభిమానులు ఈ అనూహ్య ఓటమితో తీవ్ర నిరాశకు గురయ్యారు. బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండే ఉప్పల్‌లో సన్‌రైజర్స్ బ్యాటర్ల ఊచకోత చూడాలనుకున్న వారికి తీవ్ర నిరాశే ఎదురైంది. ఓ వైపు ఓటమి.. మరోవైపు స్లో పిచ్ కారణంగా సాగిన జిడ్డు బ్యాటింగ్ వారిని మరింత బాధపెట్టాయి.

సోషల్ మీడియా వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఓ అభిమాని తన గ్రాండ్‌మదర్‌తో ఈ మ్యాచ్‌కు హాజరయ్యాడు. ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. హైదరాబాద్‌లో క్రికెట్ క్రేజ్ ఎలా ఉందో చూడని నార్త్ ఇండియన్స్ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టగా.. సన్‌రైజర్స్ అభిమానులు తమదైన శైలిలో రియాక్ట్ అవుతున్నారు. మా 'ముసలిదాని ముందు పరువు తీసారు కదరా!'అని సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లను తిట్టినట్లు పోస్టులు పెడుతున్నారు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 156 పరుగులు చేసింది. హెన్రీచ్ క్లాసెన్(41 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 62), నితీష్ కుమార్ రెడ్డి(33 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లతో 56) హాఫ్ సెంచరీలతో రాణించగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. లక్నో బౌలర్లలో మహమ్మద్ షమీ, ప్రిన్స్ యాదవ్, ఆవేశ్ ఖాన్ రెండేసి వికెట్లు తీయగా.. దిగ్వేష్ రతి, మణిమరణ్ సిద్దార్థ్ తలో వికెట్ తీసారు.
అనంతరం లక్నో సూపర్ జెయింట్స్ 19.5 ఓవర్లలో 160 పరుగులు చేసి గెలుపొందింది. రిషభ్ పంత్(50 బంతుల్లో 9 ఫోర్లతో 68 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో రాణించగా.. ఎయిడెన్ మార్క్‌రమ్(27 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 45) పర్వలేదనిపించాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో హర్ష్ దూబే(2/18) రెండు వికెట్లు తీయగా.. ఇషాన్ మలింగా, శివాంగ్ కుమార్ చెరో వికెట్ తీసారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications