Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అవసరాలకు తగ్గట్లు మా ఆటగాళ్లను ఆడిస్తాం: అక్షర్ పటేల్

జట్టు అవసరాలకు తగ్గట్లు తమ ఆటగాళ్లను బరిలోకి దించుతామని ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ అన్నాడు. గత రెండు మ్యాచ్‌ల్లో ఇంపాక్ట్ ప్లేయర్‌గా సమీర్ రిజ్వీని ఆడించడం తమకు ఫలితాన్నిచ్చిందని చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా న్యూఢిల్లీ వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 6 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్‌ను చిత్తు చేసింది.

ఈ విజయానంతరం మాట్లాడిన అక్షర్ పటేల్.. తమ బెంచ్ బలంగా ఉందని చెప్పాడు. 'టీ20ల్లో ఫ్లెక్సిబిలిటీ చాలా అవసరం. ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేయగల ఆటగాళ్లు ఉన్నప్పుడు పిచ్ పరిస్థితులను బట్టి వారిని ఉపయోగించుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఎవరినైనా ఆర్డర్‌లో ముందుకు పంపినంత మాత్రాన ఫలితం వస్తుందని గ్యారెంటీ లేదు. కానీ అది ఒక వ్యూహాత్మక నిర్ణయం.

అది సక్సెస్ అయితే చాలా బాగుంటుంది. అశుతోష్ శర్మ బాగా ఆడుతున్నాడు. కానీ ఆ రోజు అవసరాలను బట్టి ఆటగాళ్లను ఎంపిక చేస్తాం. ఆటగాళ్ల ఎంపిక విషయంలో పోటీ ఉండటం మంచిదే. ఇది మా బెంచ్ స్ట్రెంగ్త్ ఎంత బలంగా ఉందో చూపిస్తుంది. మేం ప్రతి మ్యాచ్‌ను విడివిడిగా చూస్తూ.. ఈ గెలుపు ఊపును ఇలాగే కొనసాగించాలి.'అని అక్షర్ పటేల్ చెప్పుకొచ్చాడు.

IPL 2026 Skipper Axar Patel Opens Up on Strategic Shifts and Sameer Rizvi s Impact
Photo Credit: screen grab for JioHotstar

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 162 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్(36 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 51) హాఫ్ సెంచరీతో రాణించగా.. రోహిత్ శర్మ(26 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 35) విలువైన పరుగులు చేశాడు. ఢిల్లీ బౌలర్లలో ముఖేష్ కుమార్ రెండు వికెట్లు తీయగా.. లుంగి ఎంగిడి, అక్షర్ పటేల్, విప్రజ్ నిగమ్, నటరాజన్ తలో వికెట్ తీసారు.

అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ 18.1 ఓవర్లలో 4 వికెట్లకు 164 పరుగులు చేసి గెలుపొందింది. సమీర్ రిజ్వీ(51 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్స్‌లతో 90) భారీ హాఫ్ సెంచరీతో చెలరేగగా.. పాతుమ్ నిస్సంక(30 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 44) విలువైన పరుగులు చేశాడు. ముంబై ఇండియన్స్ బౌలర్లలో దీపక్ చాహర్, మిచెల్ సాంట్నర్, కార్బిన్ బోష్ తలో వికెట్ తీసారు. ఢిల్లీ క్యాపిటల్స్‌కు వరుసగా ఇది రెండో విజయం.

Story first published: Saturday, April 4, 2026, 21:18 [IST]
Other articles published on Apr 4, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+