బ్యాటర్లతో మ్యాచ్ గెలవచ్చు.. కానీ టైటిల్ గెలవాలంటే వారు రాణించాలి: శుభ్‌మన్ గిల్
బ్యాటర్లతో మ్యాచ్‌లు గెలవచ్చని, టైటిల్ గెలవాలంటే మాత్రం బౌలర్లు రాణించాలని గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అన్నాడు. అదృష్టవశాత్తు ఈ సీజన్‌లో తమ బౌలర్లు అదరగొడుతున్నాడని తెలిపాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్)తో ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ టైటన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.
అది మా అదృష్టం..
ఈ సందర్భంగా మాట్లాడిన శుభ్‌మన్ గిల్ పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే బౌలింగ్ ఎంచుకున్నానని చెప్పాడు. 'మేం ముందుగా బౌలింగ్ చేస్తాం. పిచ్‌పై తేమ ఉన్నట్లు కనిపిస్తుంది. నిన్న వర్షం పడటంతో పిచ్ కొంచెం జిగటగా ఉంది. సెకండ్ ఇన్నింగ్స్ సమయంలో పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా మారవచ్చు. మా బౌలర్ల అసాధారణ ప్రదర్శనతో వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో గెలిచాం.
మా బౌలర్లను మేం నమ్ముతున్నాం. బ్యాటర్లు మ్యాచ్‌లు గెలిపించవచ్చు. కానీ టైటిల్ గెలవాలంటే బౌలింగ్ విభాగం ఫామ్‌లో ఉండాలి. అదృష్టవశాత్తూ మా బౌలర్లు అద్భుతంగా రాణిస్తున్నారు. ఈ సీజన్‌లో మా బౌలింగ్ విభాగం అత్యుత్తమంగా ఉంది. మాకు మంచి మూమెంటమ్ లభించింది. మా నిలకడైన ప్రదర్శనను కొనసాగించాలి.

ఎవర్నీ తక్కువ అంచనా వేయలేం..
ప్రస్తుతం ఏ జట్టును తక్కువ అంచనా వేసే దశ కాదు. మేం తదుపరి రెండు మ్యాచ్‌లు గెలిచి టాప్-2లో నిలవాలనుకుంటున్నాం. టాప్-2లో నిలిస్తే అదనపు ప్రయోజనం చేకూరుతోంది. మరో మ్యాచ్ ఆడే అవకాశం దక్కుతుంది. ఆ మ్యాచ్ ఆడే పరిస్థితి రాకూడదని మేం కోరుకుంటున్నాం. కానీ ఆ ఆప్షన్ ఉండటం వల్ల సహజంగా ఆడే అవకాశం లభిస్తుంది. ఈ మ్యాచ్‌లో మేం మా విన్నింగ్ కాంబినేషన్‌తో బరిలోకి దిగుతున్నాం.'అని శుభ్‌మన్ గిల్ చెప్పుకొచ్చాడు.
మరోవైపు టాస్ గెలిస్తే బౌలింగ్ ఎంచుకునేవాళ్లమని కేకేఆర్ కెప్టెన్ అజింక్యా రహానే అన్నాడు. పిచ్‌లో తేమ ఉన్నప్పటికీ, గాలులు వీస్తున్నాయని, సెకండ్ ఇన్నింగ్స్‌లో పెద్దగా మార్పు ఉండే అవకాశం లేదన్నాడు. తాము ఇంకా మూడు మ్యాచ్‌లు గెలవాలని, ఒక్కో మ్యాచ్ గెలిచి, ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలన్నాడు. గత ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు గెలవడం సంతోషంగా ఉందని, తమ జట్టు కాంబినేషన్ కూడా సెట్ అయ్యిందన్నాడు. ఏది ఏమైనా బ్యాటింగ్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చి, బౌలింగ్ సత్తా చాటే ప్రయత్నం చేస్తామని తెలిపాడు. వరుణ్ చక్రవర్తీ జట్టులోకి తిరిగి వచ్చాడని చెప్పాడు.
తుది జట్లు:
కోల్‌కతా నైట్ రైడర్స్ : అజింక్య రహానే (కెప్టెన్), ఫిన్ అలెన్, అంగ్క్రిష్ రఘువంశీ (వికెట్ కీపర్), కామరూన్ గ్రీన్, మనీష్ పాండే, రింకూ సింగ్, సునీల్ నరైన్, అనుకుల్ రాయ్, వరుణ్ చక్రవర్తి, సౌరభ్ దూబే, కార్తీక్ త్యాగి
గుజరాత్ టైటాన్స్: సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), జోస్ బట్లర్ (వికెట్ కీపర్), నిశాంత్ సింధు, వాషింగ్టన్ సుందర్, జేసన్ హోల్డర్, రషీద్ ఖాన్, అర్షద్ ఖాన్, కగిసో రబడ, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, మహ్మద్ సిరాజ్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications