SRH టీమ్‌లా మేం ఒకే శైలిలో ఆడం..అతను మా సీక్రెట్ వెపన్: శుభ్‌మన్ గిల్
పక్కా ప్లాన్‌తోనే సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించామని గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అన్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులా తాము ఒకే శైలిలో ఆడమని స్పష్టం చేశాడు. అసాధారణ ప్రదర్శన కనబర్చిన తమ బౌలర్లపై ప్రశంసలు కురిపించిన గిల్.. జాసన్ హోల్డర్ తమ టీమ్ సీక్రెట్ వెపన్ అని చెప్పుకొచ్చాడు.
ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా మంగళవారం అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన గుజరాత్ టైటాన్స్ 83 పరుగుల భారీ తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను చిత్తు చేసింది. బ్యాటింగ్‌కు ప్రతికూలంగా ఉన్న వికెట్‌పై 168 పరుగులు చేసిన గుజరాత్ టైటాన్స్.. బౌలింగ్‌లో సన్‌రైజర్స్‌ను 86 పరుగులకే ఆలౌట్ చేసి సంచలన విజయాన్నందుకుంది.
స్లో పిచ్‌తో దెబ్బ
భీకర బ్యాటింగ్ లైనప్ కలిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను గుజరాత్ టైటాన్స్ వ్యూహాత్మకంగా స్లో పిచ్‌తో దెబ్బతీసింది. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన శుభ్‌మన్ గిల్.. సన్‌రైజర్స్ హైదరాబాద్ టాప్-3 బ్యాటర్లను ముందే టార్గెట్ చేశామని తెలిపాడు. తమ జట్టు ఒకే తరహా శైలికి పరిమితం కాదని, కండిషన్స్‌కు తగ్గట్లు ఆడుతుందని తెలిపాడు.
'టాస్ సమయంలో నేను చెప్పినట్లే జరిగింది. మా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఇలాంటి వికెట్‌పై 170 పరుగులు చేయడం కష్టమే. మా బౌలింగ్ యూనిట్‌తో మ్యాచ్‌లో పైచేయి సాధించవచ్చని మాకు తెలుసు.

160-170 చేయాలనుకున్నాం..
మేం 160-170 పరుగులు చేస్తే.. మా బౌలింగ్ అటాక్ ముందు ఆ స్కోర్‌ను ఛేదించడం అంత సులువు కాదని ముందే మాట్లాడుకున్నాం. ఈ మ్యాచ్‌లో మా వ్యూహం కూడా అదే. వారి బ్యాటింగ్ లైనప్, ముఖ్యంగా టాప్ త్రీ బ్యాటర్ల బలాన్ని బట్టి మేం వేసిన ప్రణాళికలు పక్కాగా పనిచేశాయి. సాయి సుదర్శన్, వాషింగ్టన్ సుందర్ బ్యాటింగ్ చేసిన విధానం అద్భుతం. ఈ గెలుపు క్రెడిట్ వారికి ఇవ్వాల్సిందే.
ఒకానొక సమయంలో 170 పరుగులకు చేరుకోవడం కష్టం అనిపించింది, కానీ ఈ ఇద్దరూ మమ్మల్ని అక్కడికి చేర్చారు. అలాగే పవర్‌ప్లేలో మా బౌలర్లు అద్భుతంగా రాణించారు. మా బౌలర్లు ఇద్దరికీ అభినందనలు. నిజం చెప్పాలంటే.. ఆటలో నిలకడగా ఉండటం, సాధ్యమైనంత కఠినంగా ఆడటమే ముఖ్యం.
వారిలా ఒకే స్టైల్‌లో ఆడం..
మేం ఏదో ఒక నిర్దిష్ట శైలి, బ్రాండ్ క్రికెట్‌కు మాత్రమే పరిమితం కాము. పిచ్‌ను చూసి, పరిస్థితులను అంచనా వేసి ఆడే జట్టుగా ఉండాలని కోరుకుంటాం. 240 పరుగులు చేసే వికెట్ అయితే ఖచ్చితంగా ఆ స్కోరు కోసం ప్రయత్నిస్తాం. అయితే వికెట్ కఠినంగా ఉన్నప్పుడు, 140-150 కంటే 170-180 పరుగులు సాధించేందుకు కృషి చేస్తాం.
జాసన్ హోల్డర్ చాలా అనుభవజ్ఞుడు. అతను బంతిని వేస్తున్న లెంగ్త్‌లు మా జట్టుకు చాలా ప్లస్ అవుతున్నాయి. దాదాపు ప్రతి మ్యాచ్‌లో అతను వరుసగా నాలుగు ఓవర్లు వేస్తూ రాణిస్తున్నాడు. ఈ వాతావరణంలో అది అంత సులువు కాదు. కానీ అతను మా కోసం అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. మా టీమ్ సీక్రెట్ వెపన్‌లా మారిపోయాడు.'అని శుభ్‌మన్ గిల్ చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications