ఆ ఒక్క తప్పిదం చేయకుంటే గెలిచేవాళ్లం: శుభ్‌మన్ గిల్
చెత్త ఫీల్డింగ్‌తోనే గెలవాల్సిన మ్యాచ్‌లో ఓటమిపాలయ్యామని గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అన్నాడు. అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనతో 12-13 ఓవర్ల వరకు ఆధిపత్యం చెలాయించామని, కానీ కీలకమైన క్యాచ్‌లను వదిలేసి మూల్యం చెల్లించుకున్నామని తెలిపాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)తో ధర్మశాల వేదికగా జరిగిన క్వాలిఫయర్-1లో గుజరాత్ టైటాన్స్ 92 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది.
ఆర్‌సీబీ 255 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించగా.. గుజరాత్ టైటాన్స్ 19.3 ఓవర్లలో 162 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. రాహుల్ తెవాటియా(43 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్స్‌లతో 68) మినహా అంతా విఫలమయ్యారు.
ఫీల్డింగ్ ముంచింది..
ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై స్పందించిన శుభ్‌మన్ గిల్.. దురదృష్టవశాత్తు తమకు ఏది కలిసి రాలేదన్నాడు. వీలైనంత త్వరంగా ఈ మ్యాచ్‌ను మరిచిపోయి క్వాలిఫయర్-2కు సిద్దమవుతామని చెప్పాడు. 'పిచ్ ప్రవర్తించిన తీరుకు ఏం ఆశ్చర్యపోలేదు. మేం 12- 13వ ఓవర్ వరకు బాగానే బౌలింగ్ చేశాం. కానీ ఈ రోజు మా ఫీల్డింగ్ ఏమాత్రం ఆశించిన స్థాయిలో లేదు. కొన్ని క్యాచ్‌లు చేజార్చడమే కాకుండా.. మా గ్రౌండ్ ఫీల్డింగ్ కూడా సరిగ్గా లేదు.

ఈ మ్యాచ్ నుంచి మేం నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఈ ఓటమిని మేం వీలైనంత త్వరగా మర్చిపోయి.. క్వాలిఫైయర్ -2 మ్యాచ్‌కు సిద్దమవుతాం. మా తప్పిదాల గురించి టీమ్ మీటింగ్‌లో చర్చిస్తాం. ప్రాక్టీస్ సెషన్‌లో కూడా మాట్లాడుకుంటాం. ఈ రోజు మాకు కలిసిరాలేదు. మా ఇంటెంట్ బాగున్నప్పటికీ.. ఒత్తిడితో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాం.
పోయాము.
పవర్ ప్లేలో రాణించి ఉంటే..
ఇలాంటి మ్యాచ్‌ల్లో మంచి ఆరంభం లభించడం చాలా ముఖ్యం. పవర్‌ప్లేలో మంచి స్కోరు సాధిస్తే.. ఇలాంటి చిన్న మైదానంలో ఎంతటి లక్ష్యాన్ని అయినా ఛేదించవచ్చు. బంతి వేగంగా దూసుకెళ్లడంతో పాటు ఔట్‌ఫీల్డ్ కూడా చాలా వేగంగా ఉంది. ఒకవేళ మాకు పవర్‌ప్లేలో మంచి ఆరంభం లభించి ఉంటే.. లక్ష్యాన్ని ఛేదించేవాళ్లం. సాయి సుదర్శన్ హిట్ వికెట్ ఔటవ్వడం చాలా చాలా దురదృష్టకరం. ఇలా హిట్ వికెట్ అవ్వడం చాలా అరుదుగా చూస్తుంటాం.'అని శుభ్‌మన్ గిల్ చెప్పుకొచ్చాడు.
14, 20 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రజత్ పాటిదార్ ఇచ్చిన రెండు క్యాచ్‌లను గుజరాత్ టైటాన్స్ ప్లేయర్లు వదిలేసారు. ప్రసిధ్ కృష్ణ వేసిన 14వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ తొలి బంతికి రజత్ పాటిదార్ ఇచ్చిన కష్టతరమైన క్యాచ్‌ను కుల్వంత్ వదిలేయగా.. మూడో బంతికి ఇచ్చిన సునాయస క్యాచ్‌ను రబాడ అందుకోలేకపోయాడు. ఈ అవకాశాలతో పాటిదార్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఈ రెండు క్యాచ్‌లు పట్టి ఉంటే ఆర్‌సీబీ కష్టాల్లో పడేది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications