IPL 2026: మలుపు తిప్పిన భాగస్వామ్యం.. లక్నోపై గుజరాత్ ఘన విజయం
ఐపీఎల్ 2026 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ వరుసగా రెండో మ్యాచ్‌లో విజయం సాధించింది. లక్నో వేదికగా ఆదివారం జరిగిన డే గేమ్‌లో సమష్టిగా రాణించిన గుజరాత్ టైటాన్స్ 7 వికెట్ల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్‌ను ఓడించింది. బౌలింగ్‌లో ప్రసిధ్ కృష్ణ నిప్పులు చెరగగా.. బ్యాటింగ్‌లో శుభ్‌మన్ గిల్, బట్లర్ హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 164 పరుగులు చేసింది. ఎయిడెన్ మార్క్‌రమ్(21 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 30) మినహా మరే బ్యాటర్ చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో ప్రసిధ్ కృష్ణ(4/28) నాలుగు వికెట్లతో లక్నో పతనాన్ని శాసించగా.. అశోక్ శర్మ(2/32) రెండు వికెట్లు పడగొట్టాడు. మహమ్మద్ సిరాజ్, కగిసో రబడాకు చెరో వికెట్ దక్కింది.

అనంతరం గుజరాత్ టైటాన్స్ 18.4 ఓవర్లలో 3 వికెట్లకు 165 పరుగులు చేసి గెలుపొందింది. శుభ్‌మన్ గిల్(40 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 56), జోస్ బట్లర్(37 బంతుల్లో 11 ఫోర్లతో 60) హాఫ్ సెంచరీలతో రాణించారు. లక్నో బౌలర్లలో మహమ్మద్ షమీ, ప్రిన్స్ యాదవ్, దిగ్వేష్ రతి తలో వికెట్ తీసారు.
గుజరాత్‌ను గెలిపించిన టాస్..
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడం గుజరాత్ టైటాన్స్‌కు కలిసొచ్చింది. స్లోగా ఉన్న వికెట్‌పై పరుగులు చేయలేక లక్నో బ్యాటర్లు ఇబ్బంది పడ్డారు. వేగంగా పరుగులు రాబట్టాలనే ప్రయత్నంలో వికెట్లు పారేసుకున్నారు. మిచెల్ మార్ష్(11), రిషభ్ పంత్(18), నికోలస్ పూరన్(19), ఆయుష్ బదోని(9) వైఫల్యం లక్నో విజయవకాశాలను దెబ్బతీసింది. ప్రసిధ్ కృష్ణ అద్భుత బౌలింగ్‌తో మ్యాచ్‌ను తమవైపు తిప్పుకున్నాడు.
లక్ష్య ఛేదనలో సాయి సుదర్శన్ విఫలమైనా.. శుభ్‌మన్ గిల్, జోస్ బట్లర్ పిచ్‌కు తగ్గట్లు బ్యాటింగ్ చేశారు. రెండో వికెట్‌కు 84 పరుగులు జోడించి మ్యాచ్‌ను ఏకపక్షంగా మార్చారు. అయితే విజయం ముంగిట ఈ ఇద్దరూ వరుస ఓవర్లలో ఔటవ్వడంతో మ్యాచ్ కాస్త ఉత్కంఠగా మారింది. కానీ విజయ సమీకరణం తక్కువగా ఉండటంతో వాషింగ్టన్ సుందర్(21 నాటౌట్), రాహుల్ తెవాటియా(10 నాటౌట్) ఎలాంటి తప్పిదం చేయకుండా విజయలాంఛనాన్ని పూర్తి చేశారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications