IPL 2026: ఇదేం క్యాచ్ రా బాబు.. నోరెళ్లబెట్టిన రోహిత్, సూరీడు!(వీడియో)
పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మైండ్ బ్లోయింగ్ క్యాచ్‌తో ఆకట్టుకున్నాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో వాంఖడే స్టేడియం వేదికగా గురువారం జరిగిన మ్యాచ్‌లో బౌండరీ లైన్‌పై అయ్యర్ అదిరిపోయే క్యాచ్ అందుకున్నాడు. అతని స్టన్నింగ్ ఫీల్డింగ్‌కు ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ నోరెళ్లబెట్టారు.
ముంబై డగౌట్ సమీపంలోని బౌండరీ లైన్‌పై శ్రేయస్ అయ్యర్.. జేవియర్ బార్ట్‌లెట్ సాయంతో ఈ కళ్లు చెదిరే క్యాచ్ పూర్తి చేశాడు. ఈ అసాధారణమైన క్యాచ్‌ను దగ్గరగా చూసిన రోహిత్, సూర్య అవాక్కయ్యారు. శ్రేయస్ అయ్యర్ స్టన్నింగ్ ఫీల్డింగ్‌తో హార్దిక్ పాండ్యా(14) నిరాశగా పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

అసలేం జరిగిందంటే..?
మార్కో జాన్సెన్ వేసిన 18వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ తొలి బంతిని భారీ సిక్సర్ బాదిన హార్దిక్ రెండో బంతిని డాట్ చేశాడు. మూడో బంతిని లాంగాన్ దిశగా భారీ షాట్ ఆడగా.. సిక్సర్‌గా దూసుకొచ్చిన బంతిని బౌండరీ లైన్‌పై అయ్యర్ అద్భుతంగా అందుకొని చాకచక్యంగా లోపలికి విసిరేసాడు. అక్కడే ఉన్న బార్ట్‌లెట్ ఏ తప్పిదం చేయకుండా అందుకున్నాడు.
ఎడమవైపు గాల్లోకి ఎగురుతూ బంతిని అందుకోవడంతో పాటు అంతే సమర్థవంతంగా అయ్యర్ లోపలికి విసిరేయడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. క్యాచ్ పూర్తయిన వెంటనే శ్రేయస్ అయ్యర్.. ఇప్పుడు అరవండంటూ ప్రేక్షకులను ఉద్దేశించి సైగలు చేశాడు. అప్పటి వరకు అరిచిన ముంబై ఫ్యాన్స్.. ఈ క్యాచ్‌తో మౌనం వహించారు. దాంతో వారిని ఇంకా గట్టిగా అరవాలంటూ అయ్యర్ కోరాడు. ఈ క్యాచ్‌ను ముంబై డగౌట్‌లో కూర్చొని చూసిన రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ వావ్ అంటూ స్టన్ అయ్యారు. 'ఇదేం క్యాచ్‌రా బాబు’అని సూర్యతో రోహిత్ అన్నట్లు టీవీ కెమెరాల్లో కనిపించింది.
శతక్కొట్టిన డికాక్
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 195 పరుగులు చేసింది. క్వింటన్ డికాక్(60 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్స్‌లతో 112 నాటౌట్) అజేయ శతకంతో చెలరేగగా.. నమన్ ధీర్(31 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 50) హాఫ్ సెంచరీతో రాణించాడు. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్(3/22) మూడు వికెట్లు తీయగా.. మార్కో జాన్సెన్, శశాంక్ సింగ్ తలో వికెట్ తీసారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications