మళ్లీ ఆ రెండు తప్పిదాలే మా ఓటమిని శాసించాయి: శ్రేయస్ అయ్యర్
మళ్లీ చెత్త ఫీల్డింగ్, పేలవ బౌలింగే తమ ఓటమిని శాసించాయని పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అన్నాడు. కీలక క్యాచ్‌లు వదిలేయడంతో పాటు తమ బౌలర్లు సరైన లెంగ్త్‌లో బౌలింగ్ చేయలేదని చెప్పాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా సోమవారం ధర్మశాల వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 3 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్‌ను ఓడించింది. పవర్ ప్లేలోనే మూడు వికెట్లు తీసి కూడా 211 పరుగుల భారీ లక్ష్యాన్ని పంజాబ్ కింగ్స్ కాపాడుకోలేకపోయింది.
మళ్లీ అవే తప్పిదాలు..
ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన శ్రేయస్ అయ్యర్ తమ ఓటమిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. మళ్లీ అవే తప్పిదాలు తమ కొంపముంచాయని తెలిపాడు. 'నేను సూటిగా చెబుతున్నా.. మళ్ళీ మా ఫీల్డింగ్, బౌలింగే మా కొంపముంచాయి. ఈ వికెట్‌పై 210 పరుగులు మంచి స్కోర్. ఈ పిచ్‌పై బంతి సీమ్ అవ్వడంతో పాటు బౌన్స్ కూడా ఉంది. ఈ లెక్కన మేం 30 పరుగులు అదనంగానే చేశాం.

బంతి సీమ్ అవుతుండటంతో ఫాస్ట్ బౌలర్లను ఎక్కువగా ఉపయోగించే క్రమంలో యుజ్వేంద్ర చాహల్‌తో బౌలింగ్ చేయించలేదు. కానీ అతనితో బౌలింగ్ చేయించాలని మనసులో ఉంది. కానీ బంతి సీమ్ అవుతున్న తీరు, ఫాస్ట్ బౌలర్లకు సహకరిస్తున్న విధానం చూసి ఆగిపోయాను. మేం లైన్ అండ్ లెంగ్త్‌ను తగ్గట్లు బౌలింగ్ చేసి ఉంటే వికెట్లు తీయగలిగే వాళ్లం. కానీ దురదృష్టవశాత్తూ మళ్ళీ మేం అది చేయలేకపోయాం.
మాది చెత్త బౌలింగ్..
సరైన ప్రదేశంలో బౌలింగ్ చేస్తేనే ఈ పిచ్‌పై వికెట్లు దక్కాయి. ముఖ్యంగా కొత్త బ్యాటర్ క్రీజులోకి వచ్చినప్పుడు 'హార్డ్ లెంగ్త్' లో బంతులు వేయడం ఉత్తమమని నేను ఎప్పుడూ చెబుతుంటాను. వాటిని కొట్టడం అంత సులువు కాదు. ఎందుకంటే అలాంటి బంతులను మీరు వరుసగా వేస్తే.. కనీసం ఒక్కటైనా మిస్-హిట్ అయ్యి వికెట్ దక్కే అవకాశం ఉంటుంది. మా ప్లానింగ్‌లో ఇది మిస్సైంది.'అని శ్రేయస్ అయ్యర్ చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications