Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పంజాబ్ కింగ్స్‌కు శ్రేయస్ అయ్యర్ గుడ్ బై..?

ఐపీఎల్ 2026 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ ప్రయాణం విచిత్రంగా ముగిసింది. తిరుగులేని ఆధిపత్యంతో ఆరంభంలో వరుసగా 7 మ్యాచ్‌ల్లో 6 విజయాలు సాధించి సరికొత్త చరిత్రను లిఖించిన పంజాబ్.. ఆ తర్వాత వరుసగా 6 మ్యాచ్‌ల్లో ఓడి ప్లే ఆఫ్స్ చేరకుండానే ఇంటిదారి పట్టింది.

ఆఖరి లీగ్ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌పై అద్వితీయమైన విజయాన్ని అందుకున్నా.. ప్లేఆఫ్స్ బెర్త్‌ను దక్కించుకోలేకపోయింది. పంజాబ్ ఆశలను ముంబై ఇండియన్స్ చిదిమేసింది. రాజస్థాన్ రాయల్స్ చేతిలో ముంబై ఓడిపోవడంతో పంజాబ్ ఇంటిబాట పట్టింది.

అధ్యాయం ముగిసిందంటూ..

అయితే ఈ సీజన్ వైఫల్యం నేపథ్యంలో పంజాబ్ కింగ్స్‌కు శ్రేయస్ అయ్యర్ గుడ్‌బై చెబుతాడనే ప్రచారం జోరు అందుకుంది. ఈ సీజన్‌ను ఉద్దేశించి అయ్యర్ చేసిన ట్వీట్ ఈ ప్రచారానికి బలం చేకూర్చుతుంది. ఈ సీజన్‌లో అయ్యర్ అటు బ్యాటర్‌గా.. ఇటు కెప్టెన్‌గా సత్తా చాటాడు. కానీ ఆశించిన ఫలితాన్నిఅందించలేకపోయాడు. మూడు రోజుల తర్వాత పంజాబ్ నిష్క్రణపై శ్రేయస్ అయ్యర్ స్పందించాడు.

IPL 2026 Shreyas Iyer Reflects on Campaign After Punjab Kings Heartbreaking Playoff Elimination

'ప్రతీ పరుగు.. ప్రతీ క్షణం.. ప్రతీ పోరాట.. ఈ అధ్యాయం కృతజ్ఞతతో ముగిసింది. ఆకలి, కసితో తదుపరి అధ్యాయం మొదలవుతుంది.' శ్రేయస్ అయ్యర్ ట్వీట్ చేశాడు. అధ్యాయం ముగిసిందని పేర్కొనడంతో పంజాబ్‌కు వీడ్కోలు పలుకుతున్నాడా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

వచ్చే సీజన్‌ కోసం..

అయితే అలాంటిది ఏం లేదని, తదుపరి సీజన్‌కు రెట్టించిన ఉత్సాహం, ఆత్మవిశ్వాసంతో తిరిగి వస్తామని అయ్యర్ చెప్పకనే చెప్పాడని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాగా ఈ సీజన్‌లో 14 మ్యాచ్‌లు ఆడిన అయ్యర్ 498 పరుగులు చేశాడు. తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో అజేయ శతకంతో చెలరేగాడు.

ఐపీఎల్ 2025 మెగా వేలంలో పంజాబ్ కింగ్స్ రూ.26.75 కోట్ల భారీ ధరకు శ్రేయస్ అయ్యర్‌ను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అందుకు తగ్గట్లుగానే అయ్యర్ సత్తా చాటాడు. దశాబ్దకాలం తర్వాత పంజాబ్ కింగ్స్‌ను ఫైనల్ చేర్చాడు. ఫైనల్లో ఆర్‌సీబీ చేతిలో ఓడి తృటిలో టైటిల్ చేజార్చుకున్నాడు.

పంజాబ్ కింగ్స్‌‌ను వెనక్కి నెట్టి ప్లే ఆఫ్స్ చేరిన రాజస్థాన్ రాయల్స్.. మంగళవారం సన్‌రైజర్స్ హైదరాబాద్ ఎలిమినేటర్ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు క్వాలిఫయర్-2కు అర్హత సాధించనుంది.

Story first published: Tuesday, May 26, 2026, 18:12 [IST]
Other articles published on May 26, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+