Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2026: ఇప్పుడు అరవండి రా! ముంబై ఫ్యాన్స్‌ను రెచ్చగొట్టిన అయ్యర్!(వీడియో)

ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. వాంఖడే మైదానం వేదికగా గురువారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్‌ను పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ రెచ్చగొట్టాడు. బౌండరీ లైన్‌పై కళ్లు చెదిరే క్యాచ్ అందుకున్న అనంతరం ముంబై ఫ్యాన్స్ వైపు చూస్తూ... 'ఇప్పుడు అరవండ్రా'అని రెండు చేతులతో సైగలు చేశాడు.

వాంఖడే వేదికగా ఈ మ్యాచ్ జరగడంతో స్టేడియం మొత్తం నీలి సముద్రంగా మారిపోయింది. మొత్తం ముంబై ఇండియన్స్ ఫ్యాన్సే ఉండటంతో ఆరంభం నుంచి వారి హడావుడి ఎక్కువగా కనిపించింది. ముంబై బ్యాటర్లు బౌండరీలు బాదిన ప్రతీసారి ఆటగాళ్ల చెవులు దద్దరిల్లేలా ఫ్యాన్స్ నినాదాలు చేశారు.

కళ్లు చెదిరే క్యాచ్‌తో..

అయితే మార్కో జాన్సెన్ వేసిన 18వ ఓవర్‌లో శ్రేయస్ అయ్యర్‌ మైండ్ బ్లోయింగ్ క్యాచ్ అందుకున్నాడు. ఈ ఓవర్ మూడో బంతిని హార్దిక్ పాండ్యా లాంగాఫ్ దిశగా భారీ షాట్ ఆడగా.. అయ్యర్ అద్భుతంగా గాల్లోకి ఎగిరి అందుకున్నాడు. సమన్వయం కోల్పోయిన అతను చాకచక్యంగా బౌండరీ లోపల ఉన్న జేవియర్ బార్ట్‌లెట్‌కు బంతిని అందించాడు. దాంతో ఈ రిలే క్యాచ్ పూర్తయింది.

ముంబై ఇండియన్స్ డగౌట్ సమీపంలోనే అతను పట్టిన ఈ క్యాచ్‌కు రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ అవాక్కయ్యారు. ఏం క్యాచ్ రా బాబు అని నోరెళ్లబెట్టారు. ప్రస్తుతం ఈ క్యాచ్ టాక్ ఆఫ్ ది నేషన్‌గా మారింది. సీజన్ ఆఫ్ ది క్యాచ్‌గా నిలిచిపోనుంది.

IPL 2026 Shreyas Iyer Provokes MI Fans at Wankhede After Screamer to Dismiss Hardik Pandya

అయ్యర్ కవ్వింపులు..

అయితే ఈ క్యాచ్ పూర్తి చేసిన అనంతరం శ్రేయస్ అయ్యర్ ప్రవర్తించిన తీరు వివాదాస్పదమైంది. హార్దిక్ భారీ షాట్ ఆడగానే స్టేడియం మొత్తం దద్దరిల్లాగా.. అయ్యర్ క్యాచ్‌తో నిశబ్దంగా మారిపోయింది. దాంతో శ్రేయస్ అయ్యర్ ఇప్పుడు అరవండి రా అంటూ.. ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్‌ను రెచ్చగొట్టేలా సైగలు చేశాడు. అతని వ్యవహర శైలిని ఫ్యాన్స్ తప్పుబడుతున్నారు. ఆటగాళ్లు ఇలా దిగజారి ప్రవర్తించకూడదని, ఇది ఫ్యాన్స్ వార్‌కు దారితీస్తోందని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

పంజాబ్ ఘన విజయం..

ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 195 పరుగులే చేసింది. క్వింటన్ డికాక్(60 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్స్‌లతో 112 నాటౌట్) అజేయ శతకంతో రాణించినా.. నమన్ ధీర్(31 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 50) హాఫ్ సెంచరీతో సత్తా చాటినా ఫలితం లేకపోయింది. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్(3/22) మూడు వికెట్లతో ముంబై పతనాన్ని శాసించగా.. మార్కో జాన్సెన్, శశాంక్ సింగ్ తలో వికెట్ తీసారు.

అనంతరం పంజాబ్ కింగ్స్ 16.3 ఓవర్లలో 3 వికెట్లుకు 198 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. ప్రభ్‌సిమ్రాన్ సింగ్(39 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్స్‌లతో 80 నాటౌట్), శ్రేయస్ అయ్యర్(35 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 66) హాఫ్ సెంచరీలతో రాణించారు. ముంబై బౌలర్లలో అల్లా గజన్‌ఫర్(2/31) రెండు వికెట్లు తీయగా.. శార్దూల్ ఠాకూర్(1/42) ఒక్క వికెట్ తీసాడు. ఈ మ్యాచ్‌లోనూ జస్‌ప్రీత్ బుమ్రా(0/41) ఒక్క వికెట్ తీయలేకపోగా.. ధారళంగా పరుగులు సమర్పించుకున్నాడు.

Story first published: Friday, April 17, 2026, 7:05 [IST]
Other articles published on Apr 17, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+