Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2026: లక్నోపై పంజాబ్ ఘన విజయం.. ప్లే ఆఫ్స్ ఆశలు సజీవం!

ఐపీఎల్ 2026 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ ఎట్టకేలకు తమ పరాజయాల పరంపరకు బ్రేక్ వేసింది. వరుసగా 6 ఓటముల తర్వాత విజయం సాధించింది. శనివారం లక్నో వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

ఈ గెలుపుతో పంజాబ్ కింగ్స్ తమ ప్లే ఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. ఆదివారం ముంబై ఇండియన్స్ చేతిలో రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ చేతిలో కేకేఆర్ ఓడితే పంజాబ్ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధిస్తోంది. మరోవైపు ఈ సీజన్‌ను లక్నో సూపర్ జెయింట్స్ ఓటమితో ముగించింది. 14 మ్యాచ్‌ల్లో 4 విజయాలతో పాయింట్స్ టేబుల్‌లో అట్టడుగు స్థానంలో నిలిచింది.

IPL 2026 Shreyas Iyer Majestic Maiden Century Keeps Playoff Hopes Alive as PBKS Thrash LSG by 7 Wickets

శతక్కొట్టిన అయ్యర్..

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 196 పరుగులు చేసింది. జోష్ ఇంగ్లీస్(44 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 72) హాఫ్ సెంచరీతో రాణించగా.. ఆయుష్ బదోని(18 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 43), అబ్దుల్ సమద్(20 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 37 నాటౌట్) దూకుడుగా ఆడారు. పంజాబ్ బౌలర్లలో మార్కో జాన్సెన్, యుజ్వేంద్ర చాహల్ రెండేసి వికెట్లు తీయగా.. అజ్మతుల్లా ఒమర్జాయ్, శశాంక్ సింగ్ తలో వికెట్ పడగొట్టారు.

అనంతరం పంజాబ్ కింగ్స్ 18 ఓవర్లలో 3 వికెట్లకు 200 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. శ్రేయస్ అయ్యర్(51 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్స్‌లతో 104 నాటౌట్) అజేయ శతకంతో చెలరేగగా.. ప్రభ్‌సిమ్రాన్ సింగ్(39 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 69) హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. లక్నో బౌలర్లలో మహమ్మద్ షమీ(2/45) రెండు వికెట్లు తీయగా.. అర్జున్ టెండూల్కర్(1/36) ఒక వికెట్ పడగొట్టాడు.

కొంపముంచిన పంత్..

196 పరుగుల లక్ష్య ఛేదనలో పంజాబ్‌కు ఆశించిన ఆరంభం దక్కలేదు. మహమ్మద్ షమీ తన వరుస ఓవర్లలో ప్రియాన్ష్ ఆర్య(0), కూపర్ కానల్లీ(18)ని పెవిలియన్ చేర్చాడు. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్‌తో కలిసి ప్రభ్‌సిమ్రాన్ జట్టును ఆదుకున్నారు.

అయితే అర్జున్ టెండూల్కర్ వేసిన ఏడో ఓవర్‌లో 20 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ప్రభ్‌సిమ్రాన్ ఇచ్చిన క్యాచ్‌ను రిషభ్ పంత్ నేలపాలు చేశాడు. ఈ క్యాచ్ పట్టి ఉంటే మ్యాచ్ కాస్త ఉత్కంఠగా మారేది. ఈ అవకాశంతో చెలరేగిన ప్రభ్‌సిమ్రాన్ సింగ్ మూడో వికెట్‌కు 140 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని అందించి లక్నో పతనాన్ని శాసించాడు.

Story first published: Saturday, May 23, 2026, 23:16 [IST]
Other articles published on May 23, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+