IPL 2026: చరిత్రసృష్టించిన శ్రేయస్ అయ్యర్.. కెప్టెన్‌గా సెంచరీ !
పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలోనే 100 మ్యాచ్‌లకు సారథ్యం వహించిన ఐదో ఆటగాడిగా నిలిచాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)తో జరిగిన మ్యాచ్‌తో శ్రేయస్ అయ్యర్ ఈ ఫీట్ సాధించాడు. దాంతో ధోనీ, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి దిగ్గజాల సరసన శ్రేయస్ అయ్యర్ చేరాడు.
ఐపీఎల్‌లో అత్యధిక మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించిన ఆటగాళ్ల జాబితాలో చెన్నై సూపర్ కింగ్స్ దిగ్గజం ఎం.ఎస్. ధోని 235 మ్యాచ్‌లతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత రోహిత్ శర్మ (158 మ్యాచ్‌లు), విరాట్ కోహ్లి (143 మ్యాచ్‌లు), గౌతమ్ గంభీర్ (129 మ్యాచ్‌లు) శ్రేయస్ అయ్యర్ కంటే ముందున్నారు.

శ్రేయాస్ అయ్యర్ మూడు ఫ్రాంచైజీ తరఫున ఈ ఫీట్ సాధించాడు. 2018లో ఢిల్లీ క్యాపిటల్స్ సారథ్య బాధ్యతలు స్వీకరించిన శ్రేయస్ అయ్యర్.. ఆ జట్టు తరఫున 41 మ్యాచ్‌లకు కెప్టెన్సీ చేశారు. ఆ తర్వాత 2022లో కోల్‌కతా నైట్‌రైడర్స్ తరఫున 29 మ్యాచ్‌లకు సారథ్యం వహించిన అయ్యర్.. పంజాబ్ కింగ్స్ తరఫున 30 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించాడు.
ఐపీఎల్ చరిత్రలోనే మూడే వేర్వేరు ఫ్రాంచైజీలను ఫైనల్‌కు చేర్చిన ఏకైక సారథి కూడా శ్రేయస్ అయ్యరే కావడం విశేషం. అయ్యర్ సారథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ (2020), పంజాబ్ కింగ్స్ (2025) ఫైనల్‌కు చేరుకొని రన్నరప్‌గా నిలిచాయి. 2024లో కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్‌గా తొలిసారి జట్టుకు ఛాంపియన్ టైటిల్‌ను అందించాడు.
బ్యాటింగ్ పరంగా కూడా శ్రేయాస్ అయ్యర్ త్వరలో ఒక ముఖ్యమైన మైలురాయిని చేరుకునే అవకాశం ఉంది. కెప్టెన్‌గా ఐపీఎల్‌లో ఇప్పటివరకు 2994 పరుగులు సాధించిన అయ్యర్.. మరో 6 పరుగులు చేస్తే 3000 పరుగుల మార్కును అందుకుంటారు. కెప్టెన్‌గా అయ్యర్ 100 మ్యాచ్‌ల్లో 54 విజయాలు, 40 ఓటములను నమోదు చేసుకున్నాడు. ఐదు మ్యాచ్‌లలో ఫలితం తేలలేదు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications