నా క్యాచ్.. మ్యాచ్‌ను మలుపు తిప్పింది: శ్రేయస్ అయ్యర్
తాను పట్టిన స్టన్నింగ్ క్యాచ్‌తో పాటు బౌలర్ల అసాధారణ ప్రదర్శనతో మ్యాచ్ మలుపు తిరిగిందని పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అన్నాడు. టాస్ గెలవడం కూడా తమ విజయానికి కలిసొచ్చిందని అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా గురువారం వాంఖడే వేదికగా జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 7 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్‌ను చిత్తు చేసింది.
ఈ విజయానంతరం మాట్లాడిన శ్రేయస్ అయ్యర్.. తదుపరి మ్యాచ్‌ల్లోనూ ఇదే జోరును కొనసాగించే ప్రయత్నం చేస్తామని తెలిపాడు. 'మేం ఆడుతున్న తీరు పట్ల చాలా సంతోషంగా ఉన్నాను. వరుస విజయాలతో మా ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. ఈ విజయాల పట్ల మేం పొంగిపోవడం లేదు. వినయంగా ఉంటూ జట్టు విజయం కోసం కష్టపడుతున్నాం. ముంబైపై గెలిచినందుకు చాలా సంతోషంగా ఉంది.
నా క్యాచ్ మలుపు తిప్పింది..
ప్రభ్‌సిమ్రాన్ సింగ్ తన స్థాయిని పెంచుకున్నాడు. గతంలో పరుగులు సాధించినప్పటికీ, ఈ ఏడాది అతను మరింత పరిణతితో ఆడుతున్నాడు. మ్యాచ్ మ్యాచ్‌కూ అతను మెరుగవుతున్నాడు. నేను పట్టిన క్యాచ్‌తో పాటు మా బౌలింగ్ ప్రదర్శన ఈ మ్యాచ్‌కు టర్నింగ్ పాయింట్. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో కూడా మేం ఇలానే రాణించాం.

తదుపరి ప్రణాళికల గురించి మేం ఇంకా ఏం ఆలోచించలేదు. టాస్ గెలవడం నా అదృష్టం. జట్టులో తమను తాము నిరూపించుకోవాలనే పట్టుదల ఉన్న ఆటగాళ్లు చాలా మంది ఉన్నారు. ప్రతి మ్యాచ్‌లోనూ జట్టుగా మరింత మెరుగుపడాలని నేను వ్యక్తిగతంగా భావిస్తాను. అదే సూత్రాన్ని మేం అనుసరిస్తున్నాం. ఇక్కడికి భారీ సంఖ్యలో తరలివచ్చి మాకు అండగా నిలిచిన అభిమానులను చూడటం చాలా ఆనందంగా ఉంది.'అని శ్రేయస్ అయ్యర్ చెప్పుకొచ్చాడు.
డికాక్ సెంచరీ వృథా..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 195 పరుగులే చేసింది. క్వింటన్ డికాక్(60 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్స్‌లతో 112 నాటౌట్) అజేయ శతకంతో రాణించినా.. నమన్ ధీర్(31 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 50) హాఫ్ సెంచరీతో సత్తా చాటినా ఫలితం లేకపోయింది. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్(3/22) మూడు వికెట్లతో ముంబై పతనాన్ని శాసించగా.. మార్కో జాన్సెన్, శశాంక్ సింగ్ తలో వికెట్ తీసారు.
అనంతరం పంజాబ్ కింగ్స్ 16.3 ఓవర్లలో 3 వికెట్లుకు 198 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. ప్రభ్‌సిమ్రాన్ సింగ్(39 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్స్‌లతో 80 నాటౌట్), శ్రేయస్ అయ్యర్(35 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 66) హాఫ్ సెంచరీలతో రాణించారు. ముంబై బౌలర్లలో అల్లా గజన్‌ఫర్(2/31) రెండు వికెట్లు తీయగా.. శార్దూల్ ఠాకూర్(1/42) ఒక్క వికెట్ తీసాడు. ఈ మ్యాచ్‌లోనూ జస్‌ప్రీత్ బుమ్రా(0/41) ఒక్క వికెట్ తీయలేకపోగా.. ధారళంగా పరుగులు సమర్పించుకున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications