అతని వల్లే గెలిచాం.. శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీకి షాకయ్యా: శ్రేయస్ అయ్యర్
కూపర్ కానల్లీ అసాధారణ బ్యాటింగ్‌తోనే ఓడిపోయే మ్యాచ్‌లో విజయం సాధించామని పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తెలిపాడు. పిచ్ కండిషన్స్‌కు తగ్గట్లు కూపర్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడని కొనియాడాడు. ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా ముల్లాన్‌పూర్ వేదికగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 3 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్‌పై గట్టెక్కింది.
ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన శ్రేయస్ అయ్యర్.. అజేయ హాఫ్ సెంచరీతో పంజాబ్ విజయంలో కీలక పాత్ర పోషించిన కూపర్ కానల్లీపై ప్రశంసల జల్లు కురిపించాడు. శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీ తనను ఆకట్టుకుందని, ముఖ్యంగా తన అటాకింగ్ ఫీల్డ్ సెటప్ చూసి షాకయ్యానని తెలిపాడు.
నా గాయానికి ఐస్ పెట్టుకునేలోపే..
'నా చేతి గాయం బాగానే ఉంది. ఈ గాయానికి దిష్టి తగలకూడదని కోరుకుంటున్నా. కూపర్ కానల్లీ అద్భుతంగా ఆడాడు. ముఖ్యంగా రషీద్ ఖాన్ బౌలింగ్‌లో అతను ఆడిన షాట్లు అమోఘం. డ్రెస్సింగ్ రూమ్ లోపల నా చేతి గాయానికి ఐస్ పెట్టుకునేలోపే.. మేం వరుసగా వికెట్లు కోల్పోయాం. ఐపీఎల్‌లో ఇలా జరగడం సహజమే. ఇలాంటి పరిస్థితుల్లో ప్రశాంతంగా ఉండాలి. కూపర్ అదే చేశాడు. చాలా ప్రశాంతంగా తన ఆటను తాను ఆడాడు. ఈ మ్యాచ్ మూడో ఓవర్ తర్వాతే వికెట్ స్లోగా ఉందని మాకు అర్థమైంది.

గిల్ కెప్టెన్సీకి షాకయ్యా..
అర్ష్‌దీప్ సింగ్ వచ్చి బంతి కాస్త ఆగి వస్తోందని చెప్పాడు. అందుకే మేం బంతిని వీలైనంత త్వరగా పాతబడేలా చేయడానికి ప్రయత్నించాం. విజయ్‌కుమార్ వైశాక్ గత సీజన్ ఫామ్‌ను ఇక్కడా కొనసాగిస్తున్నాడు. అతను బిగ్ మ్యాచ్ ప్లేయర్. నా బ్యాటింగ్ సమయంలో షార్ట్ లెగ్ ఫీల్డర్‌ను చూసి ఆశ్చర్యపోయాను. నేను ఇంతకుముందు ఎప్పుడూ ఇలా షార్ట్ లెగ్ ఫీల్డర్‌ను పెట్టడం చూడలేదు. ఈ విషయాన్ని శుభ్‌మన్ గిల్‌తో కూడా చెప్పాను. కెప్టెన్లు ఇలా అటాకింగ్ ఫీల్డింగ్ సెట్ చేయడం బాగుంది.'అని శ్రేయస్ అయ్యర్ చెప్పుకొచ్చాడు.
ఉత్కంఠ పోరులో పంజాబ్ విజయం..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 162 పరుగులు చేసింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్(27 బంతుల్లో 6 ఫోర్లతో 39), జోస్ బట్లర్(33 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 38), గ్లేన్ ఫిలిప్స్(17 బంతుల్లో ఫోర్, సిక్సర్‌తో 25) టాప్ స్కోరర్లుగా నిలిచారు. పంజాబ్ కింగ్స్ బౌలర్లలో విజయ్‌కుమార్ వైశాక్(3/34) మూడు వికెట్లు తీయగా.. యుజ్వేంద్ర చాహల్(2/28) రెండు వికెట్లు పడగొట్టాడు. మార్కో జాన్సెన్‌కు ఒక వికెట్ దక్కింది.
అనంతరం పంజాబ్ కింగ్స్ 19.1 ఓవర్లలో 7 వికెట్లకు 165 పరుగులు చేసి గెలుపొందింది. కూపర్ కానల్లీ(44 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 72 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. ప్రభ్ సిమ్రాన్ సింగ్(24 బంతుల్లో ఫోర్, 4 సిక్స్‌లతో 37) పర్వాలేదనిపించాడు. గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో ప్రసిధ్ కృష్ణ(3/15) మూడు వికెట్లు తీయగా.. కగిసో రబడా, అశోక్ శర్మ, రషీద్ ఖాన్, వాషింగ్టన్ సుందర్ తలో వికెట్ తీసారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications