IPL 2026: మా వరుస ఓటములకు కారణం అదే: శ్రేయస్ అయ్యర్
సొంత ప్రతిభను నమ్మకపోవడం, ఒత్తిడిని అధిగమించకపోవడం తమ వరుస ఓటములకు కారణమని పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అన్నాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో ధర్మశాల వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగింది. ఐపీఎల్ వంటి టోర్నీల్లో ఓటములు సహజమని, కానీ ఎంత త్వరగా పుంజుకుంటామనేదే ముఖ్యమని శ్రేయస్ అయ్యర్ అన్నాడు. టాస్ సందర్భంగా మాట్లాడిన శ్రేయస్ అయ్యర్.. ధర్మశాల పిచ్ ఎలా ఉంటుందో ఆడే వరకు తెలియదన్నాడు.
ఆడితే కానీ తెలియదు..
'నిజాయితీగా చెప్పాలంటే.. ఈ వికెట్ మీద ఆడితే తప్ప ఇది ఎలా స్పందిస్తుందో నాకు తెలియదు. కాబట్టి ఏ పరిస్థితి ఎదురైనా అత్యుత్తమ ప్రదర్శన కనబర్చడం ముఖ్యం. వ్యక్తిగతంగా.. పాయింట్స్ టేబుల్ గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు.
ఈ సీజన్ అంతా మనం పాటిస్తున్న చిన్న చిన్న విషయాలపై దృష్టి పెట్టాలి. మనపై మనకు నమ్మకం ఉండాలి. ప్రతీ ఆటగాడు మ్యాచ్‌లు గెలిపించే బాధ్యతను తీసుకోవాలి. గత రెండు మ్యాచ్‌ల్లో మా జట్టులో లోపించింది ఏంటంటే.. సొంత ప్రతిభను నమ్మకపోవడం, ఒత్తిడిని అధిగమించలేకపోవడం. ఈ టోర్నీలో ఎత్తుపల్లాలు సహజం. కానీ మనం ఎంత త్వరగా పుంజుకుని అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తామన్నదే ముఖ్యం. లాకీ ఫెర్గూసన్‌కు చిన్న గాయం కావడంతో అతని స్థానంలో బెన్ ద్వార్షుయిస్ జట్టులోకి వచ్చాడు.'అని శ్రేయస్ అయ్యర్ చెప్పుకొచ్చాడు.

మాకు కలిసొచ్చిన ఏకైక అంశం..
టాస్ గెలిచిన అక్షర్ పటేల్.. బౌలింగ్ ఎంచుకున్నాడు. పిచ్ కండిషన్స్ గురించి తెలుసుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పాడు. 'మేం ముందుగా బౌలింగ్ చేస్తాం. మాకు ప్రస్తుతం కలిసి వస్తున్న ఏకైక విషయం టాస్ గెలవడం. 12 మ్యాచ్‌ల్లో 9 సార్లు టాస్ గెలిచాం. ప్రస్తుతం మా పరిస్థితి చాలా క్లిష్టంగా మారింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో కీలక సమయాల్లో మేం వెనుకంజలో నిలిచాం. అలాగని మేం మరీ దారుణమైన క్రికెట్ ఆడలేదు.
ప్లే ఆఫ్స్ చేరడానికి మాకు అవకాశాలు ఉన్నాయి. కానీ మేం దాని గురించి ఆలోచించడం లేదు. మా ఆటను మేం ఆడాలనుకుంటున్నాం. ఇతరులపై ఆధారపడకుండా.. మాదైన శైలిలో క్రికెట్ ఆడాలనుకుంటున్నాం. ఫలితం ఏదైనా సరే ఒక జట్టుగా స్వీకరిస్తాం. గెలిచినప్పుడు మేం ఎంజాయ్ చేస్తం. ధర్మశాలలో ఇది హై-స్కోరింగ్ గ్రౌండ్. ఇక్కడ ఫాస్ట్ బౌలర్లకు స్వింగ్ లభిస్తుంది. మేం మొదట బౌలింగ్ చేస్తే పిచ్ ఎలా ఉంటుందో ఒక అవగాహన వస్తుంది. అందుకే ఛేజింగ్ ఎంచుకున్నాం. మా జట్టులో ఐదు మార్పులు ఉన్నాయి. అభిషేక్ పోరెల్, సాహిల్ పరాఖ్, డేవిడ్ మిల్లర్, ఆకిబ్ నబీ, మాధవ్ తివారీ జట్టులోకి వచ్చారు.'అని అక్షర్ పటేల్ తెలిపాడు.
తుది జట్లు:
ఢిల్లీ క్యాపిటల్స్: కేఎల్ రాహుల్ (కీపర్), అభిషేక్ పోరెల్, సాహిల్ పరాఖ్, ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ మిల్లర్, అక్షర్ పటేల్ (కెప్టెన్), మాధవ్ తివారీ, ముకేష్ కుమార్, ఆకిబ్ నబీ దార్, మిచెల్ స్టార్క్, లుంగి ఎంగిడి.
పంజాబ్ కింగ్స్: ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (కీపర్), ప్రియాంశ్ ఆర్య, కూపర్ కానలీ, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), సూర్యాన్ష్ షెడ్గే, మార్కస్ స్టోయినిస్, శశాంక్ సింగ్, మార్కో జాన్సెన్, బెన్ ద్వార్షుయిస్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

