Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆ తప్పిదమే మా ఓటమిని శాసించింది: శ్రేయస్ అయ్యర్

పవర్ ప్లేలోనే మూడు వికెట్లు కోల్పోవడం తమ ఓటమిని శాసించిందని పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అన్నాడు. ప్రత్యర్థి జట్టు తమ కంటే మెరుగైన ప్రదర్శన చేసిందని అంగీకరించాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)తో జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా విఫలమైన పంజాబ్ కింగ్స్ 23 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.

ఈ ఓటమితో పంజాబ్ కింగ్స్ ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకోగా.. ఆర్‌సీబీ తమ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై స్పందించిన శ్రేయస్ అయ్యర్.. బౌలింగ్ వైఫల్యంతో పాటు టాపార్డర్ చేతులెత్తేయడం ఓటమిని శాసించిందని చెప్పుకొచ్చాడు.

పవర్ ప్లేలోనే మ్యాచ్‌ను కోల్పోయాం..

'ఆర్‌సీబీ బ్యాట్లర్లు అద్భుతమైన ఆరంభాన్ని అందుకున్నారు. పవర్ ప్లే ముగిసిన తర్వాత మా బౌలర్లపై ఒత్తిడిని పెంచుతూ పరుగులు రాబట్టారు. 222 పరుగులు చేయడమనేది నిజంగా మెచ్చుకోదగ్గ ప్రదర్శన. మేం బౌలింగ్‌లో ఆశించిన స్థాయిలో వికెట్లు తీయలేకపోయాం. అయితే పవర్ ప్లేలోనే మేం మ్యాచ్‌ను కోల్పోయాం.

పవర్ ప్లేలోనే మూడు వికెట్లు కోల్పోయాం. మా జట్టులో ఎక్కువ పరుగులు చేసేది ప్రభ్‌సిమ్రాన్ సింగ్, ప్రియాన్ష్ ఆర్య. సాధారణంగా పవర్‌ప్లేలో వారు మాకు మంచి ఆరంభాన్ని అందిస్తారు. కానీ ఈ మ్యాచ్‌లో వారు విఫలమయ్యారు. నేను కూడా త్వరగానే ఔటయ్యాను. చాలా నిరాశగా ఉంది. కానీ మిడిలార్డర్‌లో శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్ అద్భుత ప్రదర్శన కనబర్చారు.

IPL 2026 Shreyas Iyer Blames Poor Powerplay for Punjab Kings Defeat Against RCB

ఈ ఇద్దరి బౌలింగ్ సూపరో సూపర్..

మేం దాదాపు ఓవర్‌కు 10 పరుగుల రన్‌రేట్‌తో మ్యాచ్‌లో నిలిచాం. కానీ చివరికి లక్ష్యానికి కొద్ది దూరంలో ఆగిపోయాం. భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్ అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఫలితాలతో సంబంధం లేకుండా నేను ఎప్పుడూ సానుకూలంగానే ఉంటాను. ఫలితాలు నా వ్యక్తిత్వాన్ని మార్చలేవు. నేను ఎల్లప్పుడూ బలమైన దృక్పథంతోనే ముందుకు సాగుతాను. నేను గతం గురించి ఎక్కువగా ఆలోచించే వ్యక్తిని కాదు. ఇది అయిపోయింది.. ముగిసిపోయింది. రేపు ఉదయం నేను మళ్ళీ కొత్త సూర్యోదయాన్ని చూస్తాను. చీకటి తర్వాత ఎప్పుడూ వెలుగు ఉంటుందని నేను నమ్ముతాను.'అని శ్రేయస్ అయ్యర్ చెప్పుకొచ్చాడు.

వెంకటేశ్ అయ్యర్ విధ్వంసం..

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటంగ్ చేసిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 222 పరుగులు చేసింది. వెంకటేశ్ అయ్యర్(40 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్స్‌లతో 73 నాటౌట్), విరాట్ కోహ్లీ(37 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 58) హాఫ్ సెంచరీలతో చెలరేగగా.. దేవదత్ పడిక్కల్(25 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 45)పర్వాలేదనిపించాడు. టీమ్ డేవిడ్(12 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 28) మెరుపులు మెరిపించాడు. పంజాబ్ బౌలర్లలో హర్‌ప్రీత్ బ్రార్(2/35) రెండు వికెట్లు తీయగా.. యుజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్ చెరో వికెట్ తీసారు.

అనంతరం పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 199 పరుగులు చేసి ఓటమిపాలైంది. శశాంక్ సింగ్(27 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 56) హాఫ్ సెంచరీతో రాణించగా.. సూర్యాన్ష్ షెడ్గే(22 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 35) పర్వాలేదనిపించాడు. ఆర్‌సీబీ బౌలర్లలో రసిక్ సలామ్ (3/36) మూడు వికెట్లు తీయగా.. భువనేశ్వర్ కుమార్(2/38) రెండు వికెట్లు పడగొట్టాడు. జోష్ హాజెల్ వుడ్, సుయాష్ శర్మ, రొమారియోషెపెర్డ్ తలో వికెట్ తీసారు.

Story first published: Sunday, May 17, 2026, 21:06 [IST]
Other articles published on May 17, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+